చాలామంది జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో జాబ్ సాధించడమంటే అంత సులువు కాదు. సికింద్రాబాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ పోస్టులకు అభ్యర్థులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1793 పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఖాళీలు ఉన్న రీజియన్లలో ఇవే..ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తెర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుంది.
రీజియన్లు: ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తెర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్ రీజియన్లలో అభ్యర్థులను భర్తీ చేయనున్నారు.
అర్హత: ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులకు మెట్రిక్యులేషన్, ఐటీఐ , 10 వ తరగతి పాస్ అయి ఉండాలి. ఫైర్‌మ్యాన్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి.
వయస్సు : 18 ఏళ్ల నుంచి 25 మధ్య ఉన్న వారు అర్హులు.
వేతనం : ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు రూ.18,000 వేల నుంచి రూ.56,900 వరకు వేతనం చెల్లిస్తారు. ఫైర్‌మ్యాన్ పోస్టులకు నెలకు రూ.19,900 వేల నుంచి రూ.63,200 వేతనం చెల్లిస్తారు.
ఎంపిక చేసే విధానం : ఫిజికల్ ఎండ్యూరెన్స్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, సర్టిఫికెట్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పెట్టుకోవాలి.
దరఖాస్తుల ముగింపు తేదీ: నోటిఫికేషన్ విడుదల తేది నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులు చేసుకోవాలి .
పూర్తి వివరాలకు ఈ వెబ్‌సైట్ పై క్లిక్ :https://www.aocrecruitment.gov.in/ చేయండి.