‘ఓ ప్రముఖ నిర్మాతను నేను ప్రేమించా. నా ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. 14 నెలలపాటు నన్ను చిత్రహింసలు పెట్టాడు. నటన మానేయాలని దూర్భాషలాడాడు. నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేశాడు. అతడి నుంచి తప్పించి బయటపడ్డా’ అని ఓ బాలీవుడ్ నటి సంచలన విషయాలు బయటపెట్టింది.
బాలీవుడ్ నటి సయానీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ ప్రముఖ నిర్మాత తనకు నరకయాతన చూపించాడని తాజాగా బయటపెట్టింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. ప్రముఖ నిర్మాత తనను దారుణంగా హింసించాడని, ప్రైవేట్ భాగాలపై తీవ్రంగా దాడి చేశాడని చెప్పింది. అతడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని ఫ్లోరా సయానీ తెలిపింది. తాను ప్రముఖ నిర్మాతను ప్రేమించానని, అతడు తనను దుర్భాషలాడాడని చెప్పింది.
ఆ నిర్మాత తన ముఖం, ప్రైవేట్ పార్ట్స్ పై విచక్షణారహితంగా కొట్లాడని, తన ఫొన్ లాక్కొని బలవంతం చేశాడని సయానీ బయటపెట్టింది. నటన మానేయాలని 14 నెలలుగా చిత్రహింసలు పెట్టాడని, తనను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా చేశాడని స్పష్టం చేసింది. చివరికి అతని వద్ద నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చానని సయానీ వెల్లడించింది. అతడు చూపించిన నరకం నుంచి బయటపడటానికి చాలా టైమ్ పడుతుందని, ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద హ్యాపీగా గడుపుతున్నానని చెప్పింది.
నిర్మాత చూపించిన నరకం నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుందని, తనను ఇష్టపడే వారి దగ్గరకు తిరిగి వచ్చానిన సయానీ తెలిపింది. అయితే హింసించిన ఆ ప్రముఖ నిర్మాత ఎవరనేది మాత్రం సయానీ చెప్పలేదు. కాగా సయానీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంది.ఇటీవల భేడియా. దో లఫ్లోన్ కి కహానీ, గుడ్డు కి గన్ బాలీవుడ్ సినిమాల్లో సయానీ నటించింది.