అధినేత ఆదేశం నాడు… ఆయన నిర్ణయం నేడు… తాటికొండ రాజయ్య రాజీనామా తీరు…

దిశ దశ, వరంగల్:

తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా క్రెడిట్ కొట్టేసిన ఆయన క్యాబినెట్ నుండి అనూహ్యంగా బయటకు రావల్సి వచ్చింది. అధినేత ఆదేశంలో తన పదవికి రాజీనామా చేసిన ఆయన నేడు అధిష్టానం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. 2015 జనవరి 25న డిప్యూటీ సీఎంగా బాధ్యతల నుండి వైదొలగవలసి వచ్చిన ఘటనకు కారణాలు ఏంటన్నది ఇప్పటికీ అంతు చిక్కకుండానే మిగిలిపోయింది.

తొలి ఉప ముఖ్యమంత్రిగా…

కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఉద్యమానికి ఊపిరి పోయాలన్న సంకల్పంతో పదవికి, పార్టీకి రాజీనామా చేసిన రాజయ్య గులాభి జెండా ఎత్తుకుని అప్పటి నుండి గెలుస్తూనే వస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాదన్న ప్రచారం ఊపందుకోవడంతో పాటు ఆయనపై ఆరో్పణలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. 2014లో స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 237 రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. టూర్ లో ఉన్న ఆయనను హుటాహుటిని హైదరాబాద్ కు పిలిపించుకున్ని అధిష్టానం రాజీనామా చేయించేందుకు ఒప్పించింది. మొదట తనను ఎందుకు పదవి నుండి తీస్తున్నారు..? అంటూ ఘాటుగానే స్పందిచిన ఆయన అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపి వచ్చిన తరువాత కేసీఆర్ నిర్ణయానికి అనుగుణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రాజయ్య రాజీనామ విషయంలో ఎన్నెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ వాస్తవాలు మాత్రం అధిష్టానం నేటికి బయటకు చెప్పకపోగా రాజయ్య కూడా స్ఫష్టత ఇవ్వలేదు. అయితే ఉద్యమ ప్రస్థానంలో గులాభి పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం పోరాటాన్ని బలోపేతం చేసింది. కానీ స్వరాష్ట్ర కల సాకరమై రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కూడా రాజీనామాల తంతుకు తెరలేచినట్టయింది. రాజయ్యచే అధిష్టానం మంత్రి పదవికి రాజీనామా చేయించడంతోనే తొలి అడుగు పట్టినట్టయింది. అధికారం వచ్చిన తొలినాళ్లలోనే అధిష్టానం ఆదేశంతో రాజీనామా చేసిన రాజయ్య ఇప్పుడు అధికారం కోల్పోయిన మొదట్లోనే పార్టీకి రాజీనామా చేయడం గమనార్హం.

కారణమిదేనా..? 

గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రాజయ్యను పక్కనపెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన అధిష్లానం ఆయనను వ్యూహాత్మకంగానే పక్కనపెట్టిందని చెప్పవచ్చు. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ సమయంలో అధిష్టానంపై ముత్తరెడ్డి కినుక వహించడంతో ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విషయంలో మాత్రం పట్టించుకోని వైఖరే అవలంబించింది. దీంతో ఆయన ఆవేదనను రాజీనామాతో వెల్లగక్కారని అంటున్నారు ఆయన అనచరులు. ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఆయన డిమాండ్ చేసినప్పటికీ అధిష్టానం నుండి స్పందన రాలేదని గంటల వ్యవధిలోనే రాజీనామా చేయడాన్ని బట్టి చూస్తే మాత్రం ఆయన ఫిక్స్ అయిపోయిన తరువాతే తన అభిప్రాయాన్ని వెల్లడించినట్టు స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page