పుట్టుమచ్చలు చూపించాలంటూ విద్యార్థినీలకు హెడ్ మాస్టార్ వేధింపులు

ప్రస్తుతం సమాజం ఎంత దారుణంగా తయారైందంటే.. నెలల పిల్లల నుంచి రేపో మాపో పోయే పండు ముదుసలిని కూడా వదిలి పెట్టడం లేదు కామాంధులు. రోడ్డు, ఇల్లు, బటి, గుడి ఇలా ప్లేస్ ఏదైనా ఆడది ఒంటరిగా కనిపించిందంటే చాలు.. మృగాళ్ల విరుచుకుపడుతున్నారు. రోడ్ల మీద తిరిగే మగాళ్లే ఇలా ఉన్నారు అంటే.. చదువుకుని ఉన్నత స్థాయిలో ఉన్నా వ్యక్తులు కూడా ఇలానే తయారయ్యారు. పిల్లలు తప్పు చేస్తే సరిచేసి మంచి చెప్పే పొజిషన్‌లో ఉండే ఓ హెడ్ మాస్టార్ తన వద్ద చదువుకునే విద్యార్థినీలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ దారుణ సంఘటన ఆంధ్రప్రదేశ్‌‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే..

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో నల్లగుంట్ల పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదినారాయణ (61) ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ స్కూల్లో ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థినీలపై కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పుట్టుమచ్చలు చూపించాలని వారిని వేధించేవాడు. అంతే కాకుండా ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకూడదని బెదిరించే వాడు. దీంతో పిల్లలు బయపడిపోయి ఈ విషయాన్ని బయటకు చెప్పుకునే వారు కాదు. ఈ క్రమంలో జనవరి 24వ తేదిన జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించారు. దానికి ఓ స్వచ్ఛంద సంస్థ వారు హాజరయ్యారు. అయితే విద్యార్థినులు సదురు హెడ్ మాస్టార్ గురించి వారికి ఫిర్యాదు చేశారు. ఆ స్వచ్ఛంద సంస్థ పిల్లలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు హెడ్ మాస్టార్‌ను గమనించిన అధికారులకు అతడిపై వచ్చిన ఆరోపణులు నిజమేనని తేలింది. దీంతో ఈ ఘటనపై అనంతపురం జిల్లా శాఖ విద్యా అధికారి మీనాక్షికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు.. జీవి ఆదినారాయణపై విచారణ జరిపారు. వాస్తవాలు నిజమని తేలడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారిచేశారు. అంతే కాకుండా అతడిని విధుల నుండి సస్పెండ్ చేశారు.

You cannot copy content of this page