దిశ దశ, కరీంనగర్:
తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిపైనే విద్యాశాఖ అదికారులు వేటు వేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంల్ఎండీ జడ్పీ హైస్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న పి రాజభాను చంద్ర ప్రకాష్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రీజనల్ జాయింట్ డైరక్టర్ కె సత్యనారాయణ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఎంబీ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిగిన గోల్ మాల్ వ్యవహారానికి రాజభానును బాధ్యుడిని చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సెలవులో ఉన్న టీచర్ల శాలరీ బిల్లులు రూ. 10 లక్షల వరకు ట్రేజరీల్లో జమ చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా అధికారుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన లావేదేవీలు జరిగాయని రికార్డుల్లో పేర్కొంటూ చలనాలు చూపిస్తున్నప్పటికీ అమౌంట్ మాత్రం సంబంధిత అకౌంట్లలో జమ కానట్టుగా తేలిందని సమాచారం. ఏడాది క్రితం నుండి జరిగిన అవకతవకల్లో సుమారు రూ. 10 లక్షల వరకు దారి మల్లినట్టుగా గుర్తించినట్టుగా విద్యాశాఖ అధికారుల విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది.