ఉలవల్లొ కొవ్వు పదార్ధాలు అస్సలు వుండవు.100 గ్రాముల ఉడికించిన ఉలవల్లో 321 క్యాలరీల శక్తి ,22 గ్రాముల ప్రొటిన్లు,57 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ,280 మిల్లీ గ్రాముల కాల్షియం ,313 మిల్లీ గ్రాముల ఫాస్ఫరస్,ఫైబర్ ఉంటుంది. వీటిని ఆహారంతో పాటు తీసుకోవటం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆంతే కాక వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. గుండె పని తీరును కూడా మెరుగుపరస్తుంది . రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.ఉలవలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ,వీటిని ఆరోగ్యం లో భాగంగా తీసుకోవటం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్య లనుండి బయటడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లోని కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉలవలు మన రోజూ వారీ డైట్‌లో తీసుకోవడం వలన .. జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణవ్యవస్థ సమస్యలకు తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఆకలి లేదని బాధ పడే వారు వీటిని రోజులో కొద్దీ మొత్తంలో తీసుకుంటూ ఉలవలు తీసుకుంటే ఆకలిని పెంచుతాయి.
పిల్లలకు ఉలవులు ఎక్కువగా పెట్టండి. ఎందుకంటే ఉలవల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషంట్స్ కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది. దీనిలో ఆల్ఫా-అమైలేస్ ఇన్హిబిటర్ ఉంటుంది. అలాగే సీరం గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మహిళలలో కొంత మంది నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఖనిజ లవణాలూ… చర్మాన్నీ, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది.ఉలవల్లో యాంటీ- మైక్రోబియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామ్-పాజిటివ్, గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియాకు ఉలవలు వ్యతిరేకంగా పోరాడుతాయి . ఇది బాసిల్లస్ సబ్టిలిస్, స్టెఫిలోకాకస్ ఆరియస్, ఎస్చెరిచియా కోలి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది.