హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాస రావు తన చర్య సబబేనని సమర్థించుకున్నారు. అవసరమైతే వంద సార్లు కూడా ఆయన పాద పద్మాలకు నమస్కరిస్తానని స్ఫష్ఠం చేశారు. కార్తీక మాసం సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన మున్నూరు కాపు సమారాధన కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కుతున్న వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆయన తీరును తప్పు పడుతూ చేసిన వ్యాఖ్యలతో కలకలం సృష్టించాయి. అయితే ఈ విషయంపై స్పందించిన శ్రీనివాసరావు తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పాదపద్మాలకు కాళ్లు మొక్కానని, వంద సార్లు కూడా మొక్కుతానని స్పష్ఠం చేశారు. తాను మెడిసిన్ చేయడానికి కొత్తగూడెం నుండి హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియాకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే అలాంటి ఇబ్బంది కొత్తగూడెం ప్రాంత యువతకు రాకూడదన్న ఉద్దేశ్యంతో ఉన్నానన్నారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల మంజూరు కోసం ఏర్పాటు చేసిన తొలి జాబితాలో కొత్తగూడెం జిల్లా లేదని, అప్పుడు తాను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేయడంతోనే వైద్య కళాశాల మంజూరైందన్నారు. కొత్తగూడెం ప్రాంతానికి మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పాదపద్మాలకు నమస్కరించానని వంద సార్లు అయినా నమస్కరిస్తానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.