నేడు మాగుంట బెయిల్ పిటిషన్ పై విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో గురువారం పలు కీలక వ్యవహారలు జరగనున్నాయి. ఓ వైపున ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో మరో వైపున మాగుంట రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో ఫిబ్రవరి 10న అరెస్ట్ అయిన రాఘవ వైసీపీ ఓంపీ శ్రీనివాస్ రెడ్డి కొడుకు. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న రాఘవపై వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో పాత్ర ఉందన్న అభియోగాలను మోపారు. ఎర్నికా మద్యం ఉత్పత్తి కంపెనీ ద్వారా ఢిల్లీ రిటైల్ జోన్స్ లో రెండు జోన్లను రాఘవరెడ్డి దక్కించుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది.

పార్లమెంట్ సెషన్స్…

మరోవైపున పార్లమెంట్ సెషన్స్ కూడా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు బడ్జెట్ సమావేశఆలు జరుగుతున్న నేపథ్యంలోనే కవిత విచారణకు హాజరవుతుండడం గమనార్హం. ఇప్పటికే బీఆర్ఎస్ తో పాటు పలు పార్టీలో ఎంపీలు లోకసభలో ఆందోళనలు వ్యక్తం చేశారు. తాజాగా కవిత విచారణ నేపథ్యంలో ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, భారత్ జాగృతి శ్రేణులు జాతీయ దర్యాప్తు సంస్థలకు నిరసనగా ఆందోళనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

10 గంటలకు ప్రెస్ మీట్…

మరో వైపున ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసంలో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన తరువాత ఆమె ఈడీ కార్యాలయానికి వెల్లనున్నారు. అయితే కవిత మీడియా ముందు ఏం మాట్లాడబోతున్నారన్నదే హాట్ టాపిక్ గా మారింది. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం గురించి వివరిస్తారా లేక ఈడీ, మోడీలపై దుయ్యబడ్తారా లేక మహిళా బిల్లు గురించి వ్యాఖ్యానిస్తారో తెలియడం లేదు. కానీ రెండోసారి ఈడీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడనున్నారని ప్రకటించడంతో ఆమె ఏం మాట్లాడబోతారోనన్నదే చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page