దిశ దశ, భూపాలపల్లి:
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఎన్నికల నిర్వహణకు చాలినంత యంత్రాంగం లేదని ఇంధనశాఖ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ జరగాల్సి ఉండగా హై కోర్టు 21కి వాయిదా వేసింది. ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో కోర్టు విచారణ వాయిదా పడడంతో ఉత్కంఠత నెలకొన్నట్టయింది. 21న కోర్టు తీసుకునే నిర్ణయంతో కార్మిక సంఘాల ప్రచారం ఆధారపడి ఉంటుంది. ఒక వేళ ఎన్నికలు నిర్వహించాలని హై కోర్టు ఆదేశించినట్టయితే వారం రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే గేట్ మీటింగ్ లతో పాటు అన్ని వర్గాల కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించాల్సి ఉంటుంది.