ప్రస్తుతం వాతావరణంలో పలుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేస్తుంది.
దీంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలతో మాపు, ఏపీలోని కర్నూలు, నంద్యాల, కడప అనంతరపురం, నెల్లూరు ప్రకాశం, గుంటూరు, కాకినాడ, అనాకపల్లితో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయిని వాతావరణ కేంద్రం తెలిపింది అలాగే కర్నూలు, నంద్యాల, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయంట.
మరో వైపు తెలంగాణలో వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులందరూ జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ఎల్లో అర్జ్ ప్రకటించింది. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు పడనున్నాయంట.
30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈ దురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.