వాష్ రూముల్లో రహస్య కెమెరాలు… ఆందోళన చేస్తున్న విద్యార్థులు…

దిశ దశ, ఏపీ బ్యూరో:

వాష్ రూముల్లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన ఘటన ఆంధ్రపదేశ్ లో చోటు చేసుకుంది. స్టూడెంట్స్ వినియోగించే వాష్ రూముల్లో ఏర్పాటు చేసిన ఈ కెమెరాల్లో రికార్డయిన వీడియోలను విక్రయిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమరాలు ఏర్పాటు చేశారంటూ శుక్రవారం తెల్లవారు జాము వరకు విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలేజీలోని బాలికల హాస్టల్ వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసిన విషయంపై గతంలోనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కాలేజీ ఆవరణలోకి వచ్చిన విద్యార్థులు సెల్ ఫోన్ లైట్లు వేసి యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రహస్య కెమెరాలు ఏర్పాటు చేసిన వారిపై చర్య తీసుకోవడానికి కాలేజీ యాజమాన్యం వెనకడుగు వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. రహస్య కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియోలను బయటి వ్యక్తులకు అమ్ముతున్నారని బీటెక్ ఫైనల్ ఈయర్ విద్యార్థిపై దాడికి కూడా యత్నించారు. విజయ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫైనల్ ఈయర్ చదువుతున్న స్టూడెంట్ కు జూనియర్ విద్యార్థి సహకరించి కెమెరాలను ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. మరో వైపున స్టూడెంట్స్ వాట్సప్ ఛాటింగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఓ స్టూడెంట్ పేరు ఊటంకిస్తూ ఛాటింగ్ జరగడం గమనార్హం. ఆ స్టూడెంట్ వాళ్ల ఫాదర్ పొలిటికల్ లీడర్ అని అందువల్లే కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని కూడా ఛాటింగ్ చేశారు.

You cannot copy content of this page