ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం…
దిశ దశ, ఖమ్మం:
భద్రాచలం వద్ద క్రమక్రమంగా గోదావరి పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలెర్ట్ గా ఉండాలని అధికారులను ఆదేశించింది. ఎగువన ఉన్న ఇంద్రావతి, గోదావరి నదుల నుండి వరద భధ్రాద్రికి చేరుతుండడంతో ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిమగ్నం అయ్యారు అధికారులు ఇప్పటికే రెండు సార్లు గోదావరి వరదలు ఈ సీజన్ లో ముంచెత్తిన క్రమంలో మళ్లీ వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాద్రి వద్ద 50.10 మీటర్ల వరకు గోదావరిలో నీటిమట్టం చేరుకోగా రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. దీంతో వరద తీవ్రత మరింత పెరిగిత అత్యవసర సేవలందించేందు కోసం భద్రాద్రి ఐటీసీ స్కూల్ గ్రౌండ్లో హెలిక్యాప్టర్ ను సిద్దంగా ఉంచారు.