తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు… ఎందుకో తెలుసా..?

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ సరిహద్దుల్లో హై అలెర్ట్ ప్రకటించారు. సరిహధ్దులన్ని దిగ్భందనం చేశారు. కోళ్లు రవాణా చేసే వాహనాలను ఎక్కడికక్కడ నిలువరించి తిప్పి పంపించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతుండండంతో రాష్ట్రంలోకి రోగాల బారిన పడిన కోళ్లు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రభుత్వం సరిహద్దులను కట్టదిట్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలోని రామాపురం, వడపల్లి, నాగార్జున సాగర్ లలో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా చెక్ పోస్టుల వద్ద పోలీసులను నియమించిన జిల్లాల అధికారులు వాహనాలను చెక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చికెన్ తినవద్దని ప్రజలను కోరుతూ ఆదేశాలు కూడా జారీ చేసింది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు రాష్ట్రంలోకి వచ్చినట్టయితే వాటిని తిన్న వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

You cannot copy content of this page