కొనసాగుతున్న వేట… వివిధ రాష్ట్రాలకు పోలీసు బృందాలు…

కర్ణాటక నుండి వచ్చిన స్పెషల్ టీమ్…

బ్యాంకుల వద్ద హై అలెర్ట్…

దిశ దశ, వరంగల్:

రాయపర్తి స్టేట్ బ్యాంకు రాబరీపై పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపిన పోలీసులు వివిధ రాష్ట్రాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 19 కిలోల మేర బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన దోపిడీ దొంగల ముఠా గురించి వేట మొదలు పెట్టిన పోలీసులు అనుమానిత ప్రాంతాలపై నిఘా కట్టుదిట్టం చేశారు.

స్పెషల్ టీమ్స్…

బ్యాంకు రాబరీకి పాల్పడిన ముఠాను పట్టుకునేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల్లోకి వెల్లిన ప్రత్యేక బృందాలు ఆయా ప్రాంతాల్లో ఉండే దోపిడీ ముఠాల గురించి వాకబు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన తీరుపై ఆయా రాష్ట్రాల్లో జరిగిన కేస్ స్టడీస్ ఆధారంగా ఇలాంటి దోపిడీలకు పాల్పడే అవకాశం ఉన్న గ్యాంగుల గురించి కూడా వాకబు చేస్తున్నారు. దోపిడీ ముఠాలకు సంబంధించిన ఏ ఒక్క క్లూను కూడా వదిలేయకుండా ఆరా తీసే పనిలో నిమగ్నం అయ్యారు.

కర్ణాటక నుండి…

ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో కూడా ఓ బ్యాంకును దోపిడీ జరిగింది. దావణగెరె జిల్లాకు సంబంధించిన ఓ బ్యాంకులో చోరీ జరగడంతో ఆ జిల్లాకు సంబంధించిన ఓ పోలీసు అధికారి రాయపర్తి బ్యాంకు వద్దకు వచ్చి రాబరీ జరిగిన తీరుపై ఆరా తీశారు. అక్కడ జరిగిన దోపిడీ జరిగిన తీరుకు రాయపర్తిలో జరిగిన దోపిడీ జరిగిన తీరుపై ఎనాలిసిస్ చేస్తున్నారు కమిషనరేట్ పోలీసు అధికారులు.

గాయాలయ్యాయా..?

మరోవైపున రాయపర్తి బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ లో ఉంచిన లాకర్ ను గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేస్తున్న క్రమంలో దొంగల ముఠా సభ్యులకు గాయాలు అయినట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో గ్యాస్ కట్టర్ ఉపయోగించిన వారిలో ఒకరిద్దరికి దెబ్బలు తగిలి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ మేరకు వర్దన్నపేట, రాయపర్తి, పాలకుర్తి పరిసర ప్రాంతాల్లోని ఆర్ఎంపీల వద్ద కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో అనుమానితులు ఎవరైనా చికిత్స చేయించుకున్నారా, ఏదైని మందుల దుకాణాల్లో మెడిసిన్స్ కొనుగోలు చేశారా అన్న విషయం తెలుసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. దోపిడీ జరిగిన తరువాత చికిత్స చేయించుకునేందుకు వీరు ఖచ్చితంగా ట్రీట్ మెంట్ తీసుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అర్థరాత్రి ఎవరైనా మందులు తీసుకున్నట్టయితే వారి ఆకారాలు ఎలా ఉన్నాయి, ఏ వాహనంలో వచ్చారు, ఎంతమంది వచ్చారు అన్న వివరాలను తెలుసుకున్నట్టయితే దొంగల ముఠా గురించి కీలక సమాచారం చేతికి చిక్కినట్టు అవుతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

హై అలెర్ట్…

ఇకపోతే బ్యాంకుల వద్ద పోలీసు అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. వరంగల్ కమిషనరేట్ లోని వివిధ బ్యాంకుల్లో తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి వాకబు చేస్తున్నారు. సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, స్ట్రాంగ్ రూమ్ ల సామర్థ్యం, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాల గురించి తెలుసుకుంటున్న పోలీసు అధికారులు సెక్యూరిటీ ప్రి కాషన్స్ తీసుకోవాలని ఆయా బ్యాంకులకు నోటీసులు కూడా ఇస్తున్నారు.

You cannot copy content of this page