దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు కస్టడీలో ఉన్న సస్పెండెడ్ డీఎస్ప దుగ్యాల ప్రణిత్ రావు హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయనను కస్టడీకి ఇచ్చిన విషయంలో లోయర్ కోర్టు సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిండచలేదంటూ ప్రణిత్ రావు తరుపు న్యాయవాది హైకోర్టులో రెండు రోజుల క్రితం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టులో వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వూలో ఉంచింది. గురువారం ప్రణిత్ రావు తరుపున వేసిన పిటిషన్ ను హై కోర్టు కొట్టివేసింది.
