హైకోర్టుకు విన్నవించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్
దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీపై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హై కోర్టు ఆదేశించింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందించాలని హై కోర్టు ఈసీఐకి చెప్పింది. దీంతో ధర్మపురి ఎన్నికల ఫలితాల కౌంటింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల ఫలితాలపై హై కోర్టును కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పోలింగ్, కౌంటింగ్ ఫామ్స్, వివరాలు పంపించాలని హౌ కోర్టు కౌంటింగ్ అధికారిని ఆదేశించింది. అయితే అధికార యంత్రాంగం నుండి స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టు భిక్షపతితో సహా ధర్మపురి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన రికార్డులను తన ముందు ఉంచాలని మల్కాజ్ గిరీ డీసీపీని ఆదేశించింది. దీంతో బిక్షపతి ఈ సమాచారాన్ని జగిత్యాల కలెక్టర్ కు వివరించడంతో జిల్లా యంత్రాంగం సోమవారం స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఒక గది తాళం వెల్లినప్పటికీ మిగతా రెండు గదుల తాళాలు ఓపెన్ కాలేదు. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు హై కోర్టుకు విన్నవించగా, బుధవారం కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పూర్తి వివరాలను హై కోర్టు ముందు ఉంచారు. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించిన హై కోర్టు ఈ తాళం చేతులు లేకపోవడంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో భారత ఎన్నికల సంఘం కీస్ ఎలా మిస్సయ్యాయి అన్న విషయంపై పూర్తి స్థాయిలో ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నిభందనల ప్రకారం తాళం చేతులు ఎవరి వద్ద ఉండాలి, వాటిని ఎలా పర్యవేక్షించాలి, మిగతా స్ట్రాంగ్ రూమ్స్ కీస్ ఉండడం ఇవే దొరకకపోవడం ఏంటీ అన్న వివరాలను సేకరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఈసీఐకి చెందిన ప్రత్యేక అధికారుల బృందం స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ తీరుపై ఆరా తీసి సమగ్ర నివేదిక హై కోర్టుకు సమర్పించిన తరువాత కోర్టు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అయితే ఈ తాళం చేతుల అదృశ్యం విషయంలో ఎన్నికల కమిషన్ నిభందనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని, కోర్టు కూడా ఈసీఐ నివేదిక తరువాత తీవ్రంగా పరిగణించనుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ధర్మపురి ధర్మం తప్పను: అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి నియోజవకర్గ ప్రజలకు ధర్మ తప్పకుండా సేవ చేయడమే లక్ష్యం పెట్టుకున్నానని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. నియోజవర్గ ప్రజల నడుమే జీవనం సాగిస్తానని హామీ ఇచ్చారు. అయితే క్యాబినెట్ హోదాలో ఉన్న తన ప్రత్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు గుప్పించారు.