నాడు ఆభరణాలతో… నేడు బేడీలతో…

కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ 

దిశ దశ, దండకారణ్యం:

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన బడా కాంట్రాక్టర్ కూడా. సల్వాజుడుంలో చేరి నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. మైనింగ్ వ్యాపారాలు కూడా చేస్తున్న ఆయన బస్తర్ ఏరియాలోనే హై రేంజ్ జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఆయన దేవంలోనే సంచలనకం కల్గించిన జర్నలిస్టు హత్య కేసులో నిందితునిగా అరెస్ట్ అయ్యారు.

DKలోనే హైలెట్…

దండకారణ్య అటవీ ప్రాంతంలోనే హెలెట్ గా నిలిచిన ప్రముఖులలో ఒకరైన కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ 2021లో తన వివాహాన్ని జరుపుకున్న తీరు జాతీయ స్థాయిలో చర్చకు తెరతీసింది. విదేశాల నుండి డ్యాన్సర్లను, గాయనీ గాయకులను రప్పించడంతో పాటు ఓ ప్రైవేట్ హెలిక్యాప్టర్ ను కూడా వినియోగించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో బస్తర్ ఏరియాలోని బీజాపూర్ లో పెళ్లి కోసం ఈ స్థాయిలో ఖర్చు చేసిన వారు ఇటీవల కాలంలో ఎవరూ లేరనే చెప్పాలి. అటువంటి ఏరియాలో సురేష్ చంద్రాకర్ వివాహం జరుపుకున్న తీరు గురించి నేటీకి కూడా బస్తర్ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. వివాహ అనంతరం ఓ స్టేడియంలో విందు ఏర్పాటు చేయడం కూడా స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. బడా టేకేదార్ గా పేరు గడించడంతో పాటు నకల్స్ ఇలాకాలో కాంట్రాక్టు పనులు చేసేందుకు ముందుకు రావడంతో ఆయనకు బస్తర్ ప్రాంతంలో ఎక్కువ ప్రాధానత్య పెరిగింది.

నాడు అలా…

బంగారు ఆభరణాలు వేసుకుని చిన్న ఫంక్షన్ అయినా భారీ స్థాయిలో సురేష్ చంద్రాకర్ నిర్వహిస్తుంటారని పేరుంది. ఆయన వినియోగించే బంగారు ఆభరణాల గురించి కూడా బీజాపూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒంటినిండా బంగారు నగలతో ఫంక్షన్లలో అర్బాటాన్ని ప్రదర్శించిన కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్ జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ హత్య కేసులో చేతులకు బేడీలు వేసుకోవాల్సిన పరిస్థితి తయారైంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నందున సురేష్ చంద్రాకర్ కు పోలీసులు కూడా ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నిరంతరం పోలీసుల కనుసన్నల్లో బస్తర్ ప్రాంతంలో సంచరించే ఆయన నేడు అదే పోలీసుల ముందు నిందితునిగా నిలబడాల్సి వచ్చింది. రోడ్డు వర్క్ రివైజ్ ఎస్టిమేట్ చేసి 120 కోట్లకు పెంచడంతో పాటు పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారని జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ కథనాలు ప్రసారం చేయడంతో అతన్ని టార్గెట్ చేసిన హత్యకు స్కెచ్ వేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో సురేష్ చంద్రాకర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా కటకటాలపాలు కావల్సి వచ్చింది. చివరకు అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తురంటే సురేష్ చంద్రాకర్ ఎలాంటి పరిస్థితులకు దిగజారి పోవల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేశాడన్న కారణంతో జర్నలిస్టును హతం చేయడం వల్ల ఈ దుస్థికి చేరుకోవల్సి వచ్చిందన్న చర్చ స్థానికంగా సాగుతోంది. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ హత్యపై జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని చత్తీస్ గడ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏఐసీసీ ముఖ్యనేత, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా జర్నలిస్టు హత్యాకాండను ఖండించారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆప్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ ఈ ఘటనపై చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రతినిధులతో మాట్లాడారు. జర్నలిస్టులను దారుణంగా హత్య చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page