దిశ దశ, మంథని:
విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణతో జీవిస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని రిటైర్డ్ ప్రిన్సిపాల్ అంబరీష్ అన్నారు. శుక్రవారం మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ చిన్న వయసులో ఉన్నపుడే ఉన్నత ఆశయాలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్ధి దశలో ఇంటర్ ఎంతో కీలకంగా ఉంటుందన్నారు. ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం మాట్లాడుతూ ఈ కళాశాల స్థాపించి నేటికీ ముప్పై ఏళ్లు గడిచాయన్నారు. విద్యార్థులు చదువే కాకుండా అనేక అంశాల్లో కూడా ప్రతిభ కనబరచాలన్నారు. ఈ కలశాలలో పని చేసి బదిలీ పై వెళ్లిన సిబ్బంది శ్రీనివాస్, అర్జయ్య, పద్మ లను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కొండమిది ఝాన్సీ, పనకంటి శశాంక్, జగన్నాథుల తిరుపతి, రావుల తిరుమల్, మ్యేకల శ్రీదేవి, హనుమండ్ల నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి, బొల్లవరం శ్రీధర్ రావు, కొమురయ్య, మానస, దీపరాణి, రజిత, సిబ్బంది కుక్కల రాజయ్య, బియాబ్బని, సుజాత, అనసూర్య, ప్రభాకర్ పాల్గొన్నారు.
dishadasha
1232 posts