కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ…
దిశ దశ, చొప్పదండి:
సెక్యూరిటీ వాహనాల నడుమ సాగుతున్న ఆయన సడెన్ గా తన వాహానాన్ని ఆపాలని ఆదేశించారు. రోడ్డు పక్కన వర్షంలోనే భోజనం చేస్తున్న కూలీల వద్దకు వెల్లి పలకరించారు. వారితో పాటు కూలిపనికి వచ్చిన ఓ అమ్మాయిని పై చదువులు చదివించేందుకు చొరవ తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించారు. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి శివార్లలో వర్షంలో రోడ్డు పక్కన కూర్చుని భోజనాలు చేస్తున్న కూలీలను చూసి తన కాన్యాయిని ఆపించి వారితో ముచ్చటించారు. వ్యవసాయ కూలీల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి వారితో పాటు కలిసి పనిచేస్తున్న ఓ అమ్మాయిని గమనించారు. ఇంత చిన్న వయసులో కూలీ పనికి రావడం ఏంటీ..? చదువకోవడం ఇష్టమేనా అని అడిగారు. తనకు చదువకోవడం ఇష్టమే కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో కూలీ పనికి రావల్సి వచ్చిందని ఆమె వివరించింది. గ్రామానికి చెందిన బోళ్ల అక్షయ కుటుంబ పరిస్థితి విన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే ఆమె చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డికి సూచించారు. పదో తరగతి పూర్తి చేసిన అక్షయను ఇంటర్మీడియెట్ కాలేజీలో చేర్పించాలని, ఆసక్తి ఉన్నట్టయితే హాస్టల్ వసతి కూడా కల్పించాలని కూడా కోరారు.