నేడు పుస్తకావిష్కరణ
దిశ దశ, కరీంనగర్:
నిజాం విముక్తి కోసం పోరాటం చేసిన ఘనమైన చరిత్ర కరీంనగర్ ఉమ్మడి జిల్లా సొంతం. జాతీయోద్యమకారుల స్పూర్తితో ప్రాంతీయోద్యమాన్ని కొనసాగించిన ఆ నాటి యోధులు చేసిన త్యాగం అజరామం. గాలిపల్లి పోరాట చరిత్రే అయినా సిరిసిల్ల, మానాలలో చేసిన సాయుధ పోరే అయినా… మహారాష్ట్రలోని చాందా క్యాంపు ద్వారా సరిహధ్దుల్లో అట్టుడికించిన యోధుల వీరోచిత గాథలు అన్ని ఇన్ని కావు. వాటన్నంటిని క్రోడికరించి, ఆ నాటి యోధులను వ్యక్తిగతంగా కలిసి రచించిన పుస్తకమే ‘సజీవ కిరణాలు’. రేపాల నర్సింహరాములు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా తిరిగి నాటి పోరాట పటిమ గురించి వెలుగులోకి తీసుకొచ్చారు. 1993లో తొలి సారి ముద్రించగా తాజాగా రెండోసారి ఈ పుస్తకాన్ని ముద్రించారు. శనివారం 11 గంటలకు కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో ‘సజీవ కిరణాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. స్వాతంత్ర్య సమరయోధుల వారసుల పక్షణ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి న్యాయవాది, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుల వారసులు గులాభీల మల్లారెడ్డి అధ్యక్షత వహించనున్నారు. బహుభాషా కోవిధులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించునున్నారు. ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్ పుస్తక పరిచయం చేయనున్న ఆ కార్యక్రమంలో అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పల్లేరు వీర స్వామి, ఆత్మీయ అతిథులుగా బద్దం రాంరెడ్డి, చాడ రమేష్ రెడ్డి, అణభేరి విప్లవ కుమారి, శివనాద్రి ప్రమోద్ కుమార్, బద్ది పడిగ రాజిరెడ్డి, తూమోజు జగదీశ్వరాచారి, ఠాగూర్ అజయ్ క్రాంతి సింగ్, గులకోట శ్రీకాంత్, సమన్వయ కర్తగా ఎస్ సంపత్ కుమార్ లు హాజరు కానున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post