నిషేధిత సంస్థకు నిధులెలా సమకూరుస్తారు..? బండి సంజయ్ కుమార్ ధ్వజం

దిశ దశ, కరీంనగర్:

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపండ్డారు. నిషేధిత సంస్థకు నిధులు ఎలా సమకూరుస్తారంటూ ప్రశ్నించారు. సోమవారం కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తబ్లిఘీ జమాతే అనేది నిషేధిత సంస్థ అని… ఇది ప్రజలకు ఉపయోగపడే సంస్థ కానప్పుడు నిధులు ఎలా ఇస్తారని ద్వజమెత్తారు. ఈ సంస్థ తీవ్రవాదులు, ఉగ్రవాదులను తయారు చేస్తోందని, అలాంటి నిషేధిత సంస్థను ఎందుకు పెంచి పోషించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెటాయించిన నిధులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో కోవిడ్ వ్యాప్తికి తబ్లిఘీ జమాతే సంస్థే కారణమని, ఇస్లామిక్ దేశాలు కూడా ఈ సంస్థను నిషేదించాయన్నారు. ఇలాంటి సంస్థ దేశంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఆ ప్రభుత్వంలా వ్యవహరించొద్దు

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందించేందుకు లబ్దిదారుల ఎంపిక విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవద్దని బండి సంజయ్ సూచించారు. అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ ఫలాలు అందాయని, ఆ పార్టీ చేసిన తప్పులు కాంగ్రెస్ చేయకూడదన్నారు. దరఖాస్తు స్వీకరణ నుండి లబ్దిదారుల ఎంపిక వరకు పార్టీలకతీతంగా అర్హులైన వారిని ఎంపిక చేయాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని,  పది లక్షల మందికి పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అర్హులైన వారందరికి యుద్ద ప్రాతిపాదికన రేషన్ కార్డులు ఇవ్వాలని బడి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని పార్లమెంటు ఎన్నికల తరువాత ఆ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఆహంకారం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుందని, యాభై లక్షల కోట్ల సంపాదన ఎక్కడ పెట్టారని అడిగారు. ప్రతి నెల ఒకటో తారీఖున ఎందుకు జీతాలివ్వలేదని, తెలంగాణ భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. స్వేదపత్రం ఒక అబద్దాల మూట అని… కొండగట్టు, వేములవాడ ఆలయాల అభివృద్ది కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బండి సంజయ్ దుయ్యబట్టారు. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ది జరిగింది తప్ప అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కెటాయించలేదన్నారు.

You cannot copy content of this page