తారకరత్న పరిస్థితి ఎలా ఉందంటే…?

నందమూరి వారసుడు, నటుడు తారకరత్న పరిస్థితిపై బెంగుళూరు నారాయణ హృదయాలయ డాక్టర్ల బృందం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వైద్య నిపుణులు ఉదయ్ కనల్కర్, రఘు బృందం చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. BP లెవల్స్ అధికంగా వుండటం తో బ్లీడింగ్ అధికంగా అవుతోందని, గుండెపోటు వల్ల తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నాని బెలిటెన్ లో వివరించారు. రక్తస్రావాన్ని నియంత్రించేందుకు వైద్యుల బృందం ప్రయత్నం చేస్తోందని, ప్రత్యామ్నాయంగా ఎక్మో చికిత్సలో తారకరత్న ఉన్నారని వెల్లడించింది. అయితే ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఏపీలోని కుప్పం నుండి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. బెంగుళూరు నుండి ప్రత్యేకంగా కుప్పం చేరుకున్న వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స అందించారు. వైద్య సేవలు మరింత మెరుగ్గా అందించాలని సంకల్పించి ఆయన్ని బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోందని తారక్ ఆరోగ్యం మెరుగు పడేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వివరించారు.

You cannot copy content of this page