దిశ దశ, హైదరాబాద్:
దేశంలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమించి వ్యవహరించినట్టయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం No. 576/exit/2023/sdr/vol.I తేది 31 అక్టోబర్ న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951లోని సెక్షణ్ 126A (R.P.ACT 1951) సబ్ సెక్షన్ (1) ప్రకారం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రింట్, ఎలక్ట్రానికి్, ఇతర మాధ్యమాల ద్వారా ఎగ్జిట్ పోల్స్ ప్రసారం కానీ, పబ్లిష్ కానీ చేయకూడదని తేటతెల్లం చేసింది. నవంబర్ 7వ తేది ఉదయం గంటల నుండి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.