క్రికెట్ రూల్స్ ఛేంజ్
ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు ముందు ఐసీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీని వర్షం వెంటాడుతుండడంతో ఫలితాలలు తేల్చే విషయాలకు సంబంధించి నిభందనలు సవరించింది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న డీఎల్ఎస్ విధానంలో కనీసం 5ఓవర్లు అవసరం. రెండో ఇన్నింగ్స్ సమయంలో వర్షం ఆటంకం కలిగించినప్పుడు డీఎల్ఎస్ పద్ధతిలో ఫలితం నిర్ణయించాలంటే, కనీసం 5ఓవర్లు పూర్తికావాలి. గత నెల 24న సౌతాఫ్రికా, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం ఈ నిబంధన కారణంగానే తేలలేదు. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను 9ఓవర్లకు కుదించగా, రెండో ఇన్నింగ్స్‌లో 3.2ఓవర్ల సమయంలో మళ్లీ వర్షం రావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ రద్దయింది. ఇలాంటి సమయాల్లో గెలుపుతో ఊపుమీద ఉన్న టీమ్స్ అంచనాలు తలకిందులు అవుతున్నాయని ఐసీసీ గుర్తించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను అదిగమించిందుకు నూతనంగా నిభందనలను సవరించింది ఐసీసీ. ఇక నుండి సెమీ-ఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించినప్పుడు ఆ మ్యాచ్ ఫలితం నిర్ణయించాలంటే ఒక్కో ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు ఆడాలని, 10 ఓవర్లలోపు ఆట సాగుతున్న సమయంలో వర్షం ఆటంకపర్చినట్టయితే మ్యాచ్‌ను రిజర్వ్ డే నాడు ఆడించాలని నిర్ణయించింది. ముందు రోజున ఎక్కడ అయితే ఆట ఆగిపోయిందో అక్కడి నుండే మరో రోజున ఆగిపోయిన మ్యాచ్ ను యథావిధిగా కొనసాగిస్తారు. ఒక్కో ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్ల ఆట అయినా ఆడాలన్న నిబంధనను తీసుక రావడం వల్ల అటు క్రికెట్ ఆడే టీమ్స్ కు ఇటు అభిమానులకు కూడా ఊరటనిచ్చినట్టు అవుతుందని ఐసీసీ భావిస్తోంది.
ఆ రోజూ వర్షం పడితే…?
ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ రిజర్వ్ డే నాడూ మ్యాచ్ కొనసాగించే పరిస్థితులు లేనట్టయితే సెమీ-ఫైనల్స్ ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు పూర్తికానట్టయితే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందని కొత్తగా మార్చిన నిభందనలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ లోనూ ఇవే నిభందనలు అమలు చేస్తూ… రిజర్వూ డే నాడూ ఇన్నింగ్స్‌లో కనీసం 10 ఓవర్లు పూర్తి అయ్యే పరిస్థితులు లేనట్టయితే ఇరు జట్లనూ టీ20 వరల్డ్ కప్-2022 సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ నెల 9, 10న సెమీఫైనల్స్, 13న ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్, పాక్ లు, 10న జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు పోటీ పడతాయి.