దిశ దశ, జాతీయం:
గుట్టలెక్కగలవా ఓ నరహరి… చెట్టులెక్కగలవా ఓ నరహరి అన్న పాట ఆ రాష్ట్ర పోలింగ్ సిబ్బందికి పక్కాగా సరిపోతుందేమో… సాహసం చేయరా ఢింభంకా అన్నట్టుగా ఉంది ఆ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి. ఓటర్ల వద్దకు చేరుకునేందుకు అక్కడి పోలింగ్ సిబ్బంది పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆయా సోషల్ మీడియాల్లో వస్తున్న కథనాల ప్రకరాం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ డ్యూటీలకు వెల్లే యంత్రాంగం పడుతున్న అవస్థలు అన్ని ఇన్నికావు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని రుమ్‌గాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రానికి చేరుకునేందుకు సిబ్బంది ట్రక్కింగ్ చేస్తూ కొండప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నేషనల్ మీడియాలో కూడా రావడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలింగ్ యంత్రాంగానికి సెల్యూట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే మారుమూల ప్రాంతాల్లోని ఓటర్లను కూడా పోలింగులో పాల్గొనేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో హెలిక్యాప్టర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్ల వద్దకు చేరుకునేందుకు మాత్రం పోలింగ్ సిబ్బంది ట్రెక్కింగ్ చేస్తూ వెల్లాలి తప్ప మరో దారి లేకుండా పోయింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లోని సియాంగ్ జిల్లా రుమ్‌గాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ బూత్ లకు వెల్లే ఎన్నికల సిబ్బంది ఇలాంటి సాహసాలు చేయకతప్పడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.