చెరువులో శవం… తీరా వెల్లి చూస్తే..?

దిశ దశ, వరంగల్:

హన్మకొండ పట్టణంలోని ఓ చెరువులో చోద్యం చోటు చేసుకుంది. నీటిలో తేలియాడుతున్నది శవమని అనుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో్ హుటిహుటిన అక్కడకు చేరుకున్నారు. తీరా పోలీసులు చెరువు వద్దకు వెల్లి పరిశీలిస్తే అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే… హన్మకొండ పట్టణంలోని రెండో డివిజన్ రెడ్డిపురం కోవెలకుంట నీటిలో సోమవారం ఉదయం నీటి ఓ వ్యక్తి నీటిపై తేలుతూ కనిపించాడు. ఉదయం 7 గంటల నుండి మద్యాహ్నం 12 గంటలయినా నీటిపై తేలుతున్న వ్యక్తి కదలపోవడంతో శమమై ఉంటుందని భావించారు స్థానికులు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం చేరవేయడంతో కాకతీయ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ సిబ్బంది, 108 యంత్రాంగం అంతా అక్కడకు చేరుకుంది. పోలీసులు కోవెలకుంట నీటిలో తేలుతున్న వ్యక్తిని చేయి పట్టి బయటకు లాగుతున్న క్రమంలో అతను ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అంతే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఐదు గంటల పాటు నీటిలోనే తేలతూ కనిపించిన వ్యక్తి బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసి స్థానికులు అవాక్కయ్యారు. కుంట నీటి నుండి బయటకు వచ్చిన సదరు వ్యక్తి తాను గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నానని ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పని చేయించుకుంటన్నారని, సెద తీరేందుకు తానే నీటిలో పడుకున్నానని చెప్పడం గమనార్హం. నెల్లూరు జిల్లాకు చెందిన సదరు వ్యక్తి వ్యవహరించిన తీరును గమనించిన కాలనీ వాసులు ముక్కున వేలేసుకోగా పోలీసులు, 108 సిబ్బందికి చిరాకు తెప్పించింది. చివరకు అతన్ని కేయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

You cannot copy content of this page