ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్ చేసిన కంటెంట్‌ను తిరిగి పొందవచ్చు.. ఇలా ట్రై చేయండి..

ప్రస్తుతం ఫేస్ బుక్, వాట్సప్ తో పాటు ఇన్‌స్టాగ్రామ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు యువత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ ను ఉపయోగిస్తుంది. సెలబ్రెటీలతో పాటు యువతీ,యువకులు ఇన్‌స్టాగ్రామ్‌ను బాగా ఉపయోగిస్తున్నారు. తమ అభిమానుల సెలబ్రెటీలను ఫాలో అవ్వడంతో పాటు తమ ఫొటోలను షేర్ చేసేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్ల అప్డేట్స్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫీచర్లు ఉంటాయి. కానీ అవి తెలియక చాలామంది ఉపయోగించరు. మీరు మర్చిపోయి లేదా ఏదైనా కారణాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ డిలీట్ చేస్తే తిరిగి పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. అనంతరం మోర్ ఆప్షన్స్ అనే ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యాక్టివిటీ కంట్రోల్స్ పై ట్యాప్ చేస్తే రీసెంట్ డిలిటెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. టాప్ లోని టైప్ ఆఫ్ కంటెంట్ పై క్లిక్ చేయాలి. అక్కడ రీస్టోర్, ప్రొఫైల్ పోస్ట్, రీల్స్, వీడియోస్, స్టోరీస్ అనే ఆప్షన్లపై మీకు కావాల్సింది సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టాప్ రైట్ లోని మోర్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. అక్కడ రీ స్టోర్ టు ప్రొఫైల్ లేదా రీస్టోర్ టు రీస్టోర్ కంటెంట్ పై ట్యాప్ చేయాలి. ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఇన్‌స్టాగ్రామ్ లో మీరు డిలీట్ చేసిన కంటెంట్ తిరిగి వస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ లో ఇంకా చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రీల్స్ చేసేందుకు లేదా చూసేందుకు చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవుతారు. రీల్స్ విషయంలో ఇన్‌స్టాగ్రామ్ అనేక కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. కొత్త ఎమోజీలతో పాటు రకరకాల మ్యూజిక్ లను ప్రవేశపెడుతుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ద్వారా చాలామంది పాపులర్ అవుతున్నారు. రాత్రికి రాత్రి సెలబ్రెటీలుగా చాలామంది మారిపోతున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది.

You cannot copy content of this page