కాలం మారుతోంది… ఏది వాడాలన్న బ్రాండ్ పేరునే చూస్తున్నారు. ప్రొడక్ట్ బ్రాండ్ చూశాకే కొనడానికి కన్జ్యూమర్ ముందుకొస్తున్నాడు. బ్రాండ్ కి అంత వాల్యూ పెరిగిందన్నది జగమెరిగిన సత్యం. ఒక కంపెనీ తన బ్రాండ్ పేరుతో చేసే ప్రొడక్ట్.. అది ఇచ్చే క్వాలిటికి ఎప్పుడూ ముడిపడి ఉంటుంది. కస్టమర్స్ కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకునే కొనుగోల్లు జరుపుతుంటారు. ఫార్మసీ రంగంలోనూ బ్రాండ్ ఇమేజ్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ రంగంలో అన్ని ప్రాంతాల్లోకి పట్టుబిగిస్తున్నదే అపోలో ఫార్మసీ… ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.
అపోలో ఫార్మసీ
మనకి కరోనా వచ్చిన తర్వాత ఈ ఫార్మసీ యూసేజ్ ఎంతలా జరిగిందంటే ప్రతి పది మందిలో ఏడుగురు మెడిసిన్ తీసుకునే ఉన్నారు .. ఏ బిజినెస్లో రానంత సేల్స్ ఈ ఫార్మసీ బిజినెస్లో జరిగాయి.అయితే ఈ అపోలో ఫార్మసీ స్టార్ట్ చేయాలంటే మనకి మినిమం 500000 ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇంకా 12 -15 మెట్రెస్ స్పేస్ అనేది అవసరం అవుతుంది ఇంకా ఫార్మసీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఇద్దరి ఎంప్లాయిస్ని మనం అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లైసెన్స్ విషయానికొస్తే ఫార్మసీ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి బీఫామ్ మ ఫర్మ్ క్వాలిఫై అయిన వాళ్లయితే ఈ లైసెన్స్ వాళ్లకి వస్తుంది ఒకవేళ మనకి ఆ లైసెన్స్ లేకపోతే మనం ఈ బీ ఫార్మ్ లైసెన్స్ లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అపోలో ఫార్మసీ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యు డబ్ల్యు డాట్ అపోలో ఫార్మసీ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్లి కాంటాక్ట్ పేజీలో మీరు ఒక మెయిల్ పెట్టాల్సి ఉంటుంది, మాకు ఫ్రాంచైజ్ కావాలి మా ఏరియా మా అడ్రస్ ఇది అని, వాళ్లు మీకు కంపెనీ వాళ్లే కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు అందిస్తారు.