ట్విట్టర్‌లో భారీ మార్పులు.. త్వరలో అందుబాటులోకి కొత్త వెర్షన్..

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నో వివాదాల తర్వాత ట్విట్టర్ ను మస్క్ తన ఆధీనంలోకి తీసుకున్నాడు. మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారీ మార్పులను ట్విట్టర్ యాజమాన్యం తీసుకొచ్చింది. నష్టాల్లో ఉన్న ట్విట్టర్‌ను లాభాల్లోకి తెచ్చే దిశగా మస్క్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

ఏకంగా వేల మంది ఉద్యోగులను ట్విట్టర్ నుంచి తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి. సిబ్బందిని తగ్గించుకునేందుకే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు ట్విట్టర్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఎన్ని విమర్శలు వచ్చినా ఎలన్ మస్క్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇటీవల ప్రవేశపెట్టిన బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌పై కూడా విమర్శలు రాగా.. ఇప్పుడు ట్విట్టర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

త్వరలో కొత్త వెర్షన్‌ను ట్విట్టర్ తీసుకురానుంది. ప్రకటనలు లేకుండా ట్విట్టర్ ను యాక్సెస్ చేసేలా కొత్త వెర్షన్ తీసుకురానున్నారు. దీని కోసం ప్రకటనలు లేకుండా ట్విట్టర్ బ్రౌజ్ చేయాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకునేలా ఛార్జీలు వసూలు చేయన్నారు. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి ఎలాంటి ప్రకటనలు చూపించవు. దీని వల్ల ట్విట్టర్ బ్రౌజింగ్ మరింత సులువుగా ఉంటుంది. మధ్యలో పెద్ద పెద్ద యాడ్స్ రావడం వల్ల యూజర్లకు అసౌకర్యంగా ఉంటుంది. మధ్యలో యాడ్స్ ఎక్కువగా కనిపించకపోవడం వల్ల యూజర్లకు ఎక్కువ ఆసక్తి ఉండటం లేదు.

ఈ క్రమంలో సబ్‌స్క్రిప్షన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ట్విట్టర్ కు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ సబ్‌స్కిప్షన్ ఫీజు అమెరికాలో 11 డాలర్లుగా ఉంది. వెబ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు నెలకు 8 డాలర్లగా ఉండగా.. ఏడాదికి 84 డాలర్ల రాయితీ వద్ద లభిస్తోంది. ఇప్పటికే బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఫీజును ట్విట్టర్ వసూలు చేస్తోంది. దీని వల్ల కూడా భారీగా ఆదాయం వస్తోంది. ఇలా ఆదాయం పెంచుకుని ట్విట్టర్ ను నష్టాల బాట నుంచి గట్టెక్కించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

You cannot copy content of this page