దిశ దశ, అంతర్జాతీయం:
చైనాలో భారీ భూకంపం చోటు చేసుకుంది. బాధిత ప్రాంతంలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించినిట్టుగా ప్రాథమిక సమాచారం. రిక్టర్ స్కేల్ పై 6.2గా నమోదయినట్టుగా చైనా అధికార వర్గాలు మీడియాకు తెలిపాయి. కింఘాయ్ ప్రావిన్స్ ప్రాంతంలో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 111 మంది మృత్యువాత పడగా వందలాది మంది గాయాలైనట్టుగా తెలుస్తోంది. కింఘాయ్ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా అంబూలెన్స్ లను, వైద్య సిబ్బందిని పంపించింది. బాధితులకు ప్రాథమిక చికిత్స అందించి ఎప్పటికప్పుడు ఆసుపత్రులకు తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే భూకంపం సంభవించిన ప్రాంతంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.