మొరాకోలో మరణ మృదంగం…. అతలాకుతలం అయిన జనం

దిశ దశ, అంతర్జాతీయం:

మొరాకోలో భారీ భూకంపం సంభవించడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం కారణంగా వేలాది మంది వరకు మరణించి ఉంటారని అంచనా. అలాగే మరో 2 వేల మంది తీవ్ర గ్రాయాల పాలయినట్టుగా అక్కడి అధికార వర్గాలు తెలిపాయి. రిక్టర్ స్కేల్ పై 6.8గా భూకంప తీవ్రత నమోదు కాగా పెద్ద భవనాలన్ని కూడా నేలమట్టం అయ్యాయి. 60 ఏళ్లలో ఇలాంటి ఘటన దేశంలో చోటు చేసుకోలేదని, భారీ విపత్తు ఇదేనని మొరాకో అధికారులు చెప్తున్నారు. దేశంలోని మరకేష్, సఫి ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టం తీవ్రంగా ఉన్నట్టుగా వివరించారు. ఈ భూకంప ప్రభావకం 45 లక్షల మందిపై చూపిందని వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అర్తనాదాలు మిన్నంటిపోయాయి. ఒక్క సారిగా భూకంపం రావడంతో అసలేం జరిగిందో అంతుచిక్కక గందరగోళానికి గురయ్యారు మొరాకో ప్రజలు. ఇప్పటికీ తమ వాళ్ల ఆచూకి కోసం వెతుకుతూనే ఉన్నారు బాధితులు. అత్యంత విషాదాన్ని నింపిన ఈ ఘటన మొరాకో దేశంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page