దిశ దశ, ములుగు:
ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో పలువురు నక్సల్స్ మరణించినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున జరిగినట్టుగా తెలుస్తున్న ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు నక్సల్స్ మరణించినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు దళ కమాండర్ కురుసం మంగు అలియాస్ భద్రుతో పాటు మరో ముగ్గురు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించిన తరువాతే తెలియనున్నాయి.
dishadasha
1264 posts
Prev Post
Next Post