జీవితాంతం ఒకరికి మరొకరు తోడుగా ఉండే పవిత్ర బంధం భార్యా భర్తల అనుభందం. కానీ ప్రస్తుత సమాజంలో అలా పెనవేసుకుని ఉంటున్న బంధాలు తగ్గిపోతున్నాయి. భర్త ఉండగా భార్య.. భార్య ఉండగా భర్త వేరే వారితో సన్నిహితంగా ఉంటూ భార్యా భర్తల బంధానికే తలవంపులు తెస్తున్నారు కొందరు. ఆధునికత ముసుగులో కల్చర్ లో ఇదో భాగం అన్నట్టుగా మారిపోయిందన్నది కూడా వాస్తవం. కానీ భార్యా చనిపోయినా.. భర్త చనిపోయినా వారి జ్ఞాపకాల దొంతరల నడుమ జీవనం సాగించే వారూ ఉన్నారు. తాజాగా వెలుగలోకి వచ్చిన అలాంటి సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లో వెళితే…
లీవ్ ఆన్ అనే వ్యక్తికి చిన్న వయసులోనే 1975 లో వివాహం జరిగింది. వైవాహిక బంధంతో ఒక్కటైన ఈ జంట ఎంతో సంతోషంగా, అన్యోనం గా ఉండేవారు. చిన్నతనం లోనే పెళ్లి కావడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా ఒకరి అభిప్రాయాలను మరోకరు అర్థం చేసుకుని కొత్త జీవితాన్ని కొనసాగించారు. వీరికి ఏడుగురు సంతానం కలిగారు. ఒకరినొకరు వదిలి ఉండలేనంత అప్యాయత వీరి మధ్య పెరిగింది. అంతలోనే వారి జీవితంలో ఎడబాటు తప్పలేదు.
అయితే ఈ ఇద్దరి ప్రేమను విధి వెక్కిరించింది. 2003 లో లీవ్ ఉద్యోగ రీత్యా ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలోనే తన భార్య చనిపోయిందని ఓ చేదు వార్త విన్నాడు. వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికి తన భార్యను ఎక్కువ సేపు చూసుకోలేక పోయాడు. సమయం లేక ఆమెను పుడ్చేసారు. అయితే అప్పటి నుంచి రోజు వెళ్లి తన భార్య సమాధి వద్ద పడుకునే వాడు. అలా కొన్ని నెలలు గడిచేసరికి ఒక రోజు వర్షం రావడంతో సమాధి వద్ద పడుకోవడం కుదరకపోవడంతో అక్కడ సొరంగం తవ్వి పడుకున్నాడు. ఇలా కాదు అనుకుని తన భార్య సమాధిని తవ్వి ఆ అస్థికలు ఇంటికి తీసుకొచ్చకున్నాడు. అవి కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ప్లాస్టర్ అఫ్ పారిస్, సిమెంట్, జిగురు ఇసుకల మిశ్రమంతో లీవ్ తన భార్య రూపంలో బొమ్మను తయారు చేసుకుని.. ఆ అస్తికలను అందులో ఉంచాడు. అప్పటినుండి ఆ బొమ్మని తన భార్యగా ఊహించుకుని నిద్రపోయేవాడు. ఇలా దాదాపుగా 16 ఏళ్ల నుంచి చనిపోయిన తన భార్య అస్థికలను పక్కన పెట్టు కుని పడుకుంటున్నారు. మరణించిన తరువాత కొత్త వారిని తమ జీవితాల్లోకి ఆహ్వానించి గతాన్ని మర్చి పోయి జీవిత భాగస్వాములను విస్మరించిన వారెందరో. కానీ ఈయన మాత్రం తన భార్యతో పెనవేసుకున్న బంధాన్ని మర్చిపోలేక శాశ్వతంగా తనతోనే భార్య ఉందన్న ఫీలింగ్ తో జీవించేందుకు ప్రయత్నించడం విశేషం.