మణికట్టు మాంత్రికులను మరిపించాడు…

స్టైలీష్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు

క్రికెట్ రారాజు సి‘రాజ్’

దిశ దశ, న్యూ ఢిల్లీ:

భారత క్రికెట్ లో అజహరుద్దీన్ సాధించిన అద్భుతాలను నేటితరానికి తెలియకపోవచ్చు. ఆ తరం క్రికెట్ అభిమానులకు కనువిందు చేసిన సందర్భాలు ఎన్నెన్నో. మన హైదరాబాద్ బిడ్డ అంతర్జాతీయ క్రికెట్ లో భారత్ కు వన్నె తెచ్చిన తీరు గురించి కథకథలుగా చెప్పుకుంది ఆనాటి తరం. తన మణికట్టు ద్వారా బ్యాట్ ను ఝులిపిస్తూ డిఫరెంట్ షాట్స్ కొడుతూ తన స్టైల్ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు అజహరుద్దీన్. భారత క్రికెట్ క్యాప్టెన్ గా ఎదిగిన ఆయన తెలుగు క్రీడాకారుల ఔన్నత్యాన్ని శిఖారగ్రాభాగాన నిలిపారు. ఒకప్పుడు అజహరుద్దీన్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడంటే క్రికెట్ అభిమానులు క్రేజీక్రేజీగా చూసేవారు. బ్యాటింగ్ లో తనదైన స్టైల్ చూపించిన ఆయనపై క్రికెట్ ప్రేమికులు ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించే వారు. ఆ తరువాత వీవీఎస్ లక్ష్మణ్ కూడా తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి. అద్భుతమైన ఇన్నింగ్స్ ఎన్నో ఆడిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ పేరు కూడా భారత క్రికెట్ చరిత్రలో చెప్పుకోదగిందే. భారత జట్టును ఆదుకోవడమే కాదు గెలుపు బాట వైపు పయనించేలా చేసిన ఘనత వీవీఎస్ దే. అయితే నాటి తరం బ్యాంటింగ్ లో మెరుపులు మెరిపిస్తే నేటి తరానికి చెందిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో తన సత్తా చాటుకుంటున్నారు. కఠోర శ్రమ చేసి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన హైదరాబాద్ బాద్షాగా మెరుపులు మెరిపిస్తున్న తీరు నేటి తరం క్రికెట్ అభిమానులను ఉర్రూతలుగిస్తోంది. ఆసియా కప్ ఫైనల్ లో తన ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ క్రీడాభిమానులను తనవైపు తిప్పుకున్న ఘనత సిరాజ్ కే దక్కుతుంది. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక క్రికెటర్ల భరతం పట్టిన సిరాజ్ ఏడు ఓవర్లలో ఆరు వికెట్లు తీసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తన బౌలింగ్ మంత్రంతో లంకేయులకు చుక్కలు చూపించిన తీరు క్రికెట్ అభిమానులకు సరికొత్త ఊపునిచ్చింది. ఈ ఏడాది 13 వన్డేలు ఆడిన సిరాజ్ 12.86 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడంటే ఆయన బౌలింగ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సిరాజ్ మహారాజ్

శ్రీలంకతో జరిగిన ఆసియా ఫైనల్లో విజయ బావుటా ఎగురవేసిన భారత్ జట్టు బౌలర్ సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డు ద్వారా తనకు వచ్చిన నగదు పారితోషికాన్ని తన కోసం వాడుకోవాలనుకోలేదు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కింద వచ్చిన రూ. 4.15 లక్షలు గ్రౌండ్స్ మెన్ కు ఇస్తున్నట్టు ప్రకటించారు. మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్ లో ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కిన సిరాజ్ ఔదర్యాంలోనూ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి. హైదరాబాదీ స్టైలీష్ బాలర్ సిరాజ్ మరిన్ని అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

You cannot copy content of this page