ఏప్రిల్ 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడగింపు… జైలు నుండి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత

దిశ దశ, న్యూ ఢిల్లీ:

దర్యాప్తు సంస్థల కన్నా ఎక్కువగా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతోంది… నా మొబైల్ నంబర్లు ఛానెల్స్ లో వేసి ప్రైవసీకి దెబ్బ తీస్తున్నారంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న కవిత తీహాడ్ జైలు నుండి రౌస్ ఎవెన్యూ కోర్టుకు రాసిన లేఖ బహిర్గతం అయింది. రాజకీయ పరపతిని దెబ్బతీసేందుకే నా మొబైల్ నంబర్లను ఛానెల్స్ లో ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఆర్థిక లాభం చేకూరలేదని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల కంటే ఎక్కువగా మీడియా సంస్థల విచారణే ఎక్కువగా సాగుతోందని విచారం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ ఎలాంటి ఆధారాలు లేకుండానే, కేవలం వాంగ్మూలం ఆధారంగానే మార్చి 15న తనను దేశ వ్యాప్తంగా జరగనున్న లోకసభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేశారన్నారు. సమ కవిత వివరించారు. నేడు దేశ వ్యాప్తంగా ఈడీ, సీబీఐ సంస్థలు నమోదు కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష పార్టీల నాయకులపైనే ఉన్నాయని, నిందితులు బీజేపీలో చేరిదే దర్యాప్తు అర్థాంతరంగా ఆగిపోతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పార్లమెంట్ ఫ్లోర్ లో కూడా బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రతిపక్ష పార్టీలను హెచ్చరిస్తున్నారని, ‘‘ చుప్ హో జావో వానా ఈడీ బేజుంగా’’ అని వ్యాఖ్యానిస్తున్నారని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్ని కూడా న్యాయవ్యవస్థపైనే నమ్మకం పెట్టుకున్నాయన్నారు. దర్యాప్తు సంస్థలకు తాను అన్ని విధాలుగా సహకరించానని, నాకున్న అవగాహన మేరకు ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పానన్నారు. నేను అన్ని మొబైల్ ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించినా వాటిని నేను ధ్వంసం చేశానని ఆరోపిస్తున్నారని, గత రెండున్నరేళ్లుగా దర్యాప్తు సంస్థలను పలు మార్లు దాడులకు పాల్పడ్డారని ఫిజికల్ గా, మెంటల్ గా వేధింపులకు గురి చేశారని, బెదిరింపులకు పాల్పడడమే కాకుండా చాలామందిని అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. ఈ కేసు మొత్తం కూడా వాంగ్మూలం ఆధారంగా మాత్రమే కొనసాగుతోందన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను కేవలం బాదితురాలిని మాత్రమేనని నిందితురాలిని కాదని వివరించారు.  చదువుకుంటున్న తన కొడుకుకు అత్యంత కీలకమైన సమయం అయినందును అందుబాటులో లేని ప్రభావం అతనిపై తీవ్రంగా పడుతుందని కూడా పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోర్టును అభ్యర్థించారు కల్వకుంట్ల కవిత.

ఏప్రిల్ 23 వరకు…

ఢిల్లీలో తీహాడ్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో కోర్టులో హాజరు పరిచారు. ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల 23 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇంతకు ముందే కవితకు మధ్యంతర బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా వాదనలు విన్న కోర్టు సోమవారం నాడు నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను తిరిగి తీహాడ్ జైలుకు తరలించారు.

You cannot copy content of this page