నేనెలాంటి తప్పు చేయలేదు: జర్నలిస్ట్ ప్రశాంత్

టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బెయిల్ పై విడుదల

దిశ దశ, కరీంనగర్:

నేనెలాంటి తప్పు చేయలేదు, నాపై చేసినవన్ని తప్పుడు ఆరోపణలే ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నేను జర్నలిస్టు పాత్ర మాత్రమే పోషించానని అన్నారు ప్రశాంత్. ఈ నెల 5న కమలాపూర్ హిందీ పేపర్ బయటకు వచ్చిన కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ప్రశాంత్ బుధవారం కరీంనగర్ జిల్లా జైలు నుండి బెయిలుపై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ… జర్నలిస్టుగా ఉన్న తాను ఇతర జర్నలిస్టులకు మాత్రమే పేపర్ ను షేర్ చేశానని దానిని, ఇందుల కుట్ర కానీ కుతంత్రాలు కానీ లేవని, తాను చేసిన ఈ పని అక్రమమని నాపై నిందమోపి కేసు పెట్టారన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టడాన్ని బూచిగా చూపించి కేసులో ఇరికించారని, కండిషన్ బెయిల్ పై బయటకు వచ్చిన నేను అన్ని విషయాలు మీడియాతో పంచుకోలేనని వెల్లడించారు. నా మొబైల్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసినందున దానిని స్వాధీనం చేసుకున్న తరువాత నేను వాస్తవాలు వివరిస్తానన్నారు. నాకు హిందీ పేపర్ వచ్చిన 46 నిమిషాలకు తోటి జర్నలిస్టుల గ్రూపులో పోస్ట్ చేశానని, ఆ తరువాత నాకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు ఫోన్ చేసి సమాచారం అడిగారు. సహచర జర్నలిస్టులు కాబట్టే నేను అందరి ఫోన్లకు రెస్పాండ్ అయ్యానన్నారు. బండి సంజయ్ తో గంటలు గంటలు ఏమీ మాట్లాడలేదని, పీఆర్వో అందుబాటులో లేడని చెప్పడంతో ఒకరోజు ముందు సమాచారం టైప్ చేసి పంపిచానని ప్రశాంత్ వివరించారు. అది కూడా విద్యార్థులకు భరోసానిచ్చే విధంగా ఉన్న మెసెజ్ పంపిచాలని బండి సజయ్ కోరితే పంపించానని, ఇదే తొలిసారి కాదని సంజయ్ కి తనకు ఉన్న అనుభందం చాలా ఏళ్లనాటిదని చాలా అంశాలపై చర్చించిన సందర్భాలూ ఉన్నాయన్నారు. అందులో భాగంగానే పంపించాను తప్ప ఆ ఫోన్ కాల్స్ కు పేపర్ మాల్ ప్రాక్టీసుకు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంత్ కుండ బద్దలు కొట్టారు.

కరీంనగర్ జిల్లా జైలు నుండి బెయిలుపై విడుదలైన జర్నలిస్ట్ ప్రశాంత్

You cannot copy content of this page