దిశ దశ, మంచిర్యాల:
రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పడుతూ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ విడుదల చేసిన వీడయో నెట్టింట వైరల్ అవుతోంది. మంగళవారం రాత్రి మంత్రి కేటీఆర్ టీవీ ఛానెల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, శేజల్ వద్ద ఉన్న ఆధారాలు సేకరించాలని ఆఫీసులోకి పిలిపించి మాట్లాడాలని తమ పార్టీ ఎంపీలను కోరానని కేటీఆర్ వివరించారు. లైంగిక వేదింపులు జరగలేదని కానీ ఇంకోటి కానీ జరగలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ శేజల్ వీడియో విడుదల చేశారు. ఆమె చెప్తున్న కథనం ప్రకారం… మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష్య సాక్షిలా అక్కడ ఉన్నట్టుగా చెప్పడం బాధాకరమని, మొదటి రోజు నుండి తాము ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ పార్టీని కాపాడుకునేందుకు ఇలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నానని అయితే ఇఫ్పటికైనా ఈ విషయంపై విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. ఒక వేళ తాను తప్పు చేసినట్టయితే తనపై విధించే ఏ శిక్షకైనా సిద్దమేనని, ఒక వేళ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసే తప్పుకు శిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందా అని శేజల్ ప్రశ్నించారు.
బాధితురాలు శేజల్ ఏమంటున్నారో మీరూ వినండి…
https://youtu.be/C9sD0P2GNh0