మరణించిన సహచరికి ఏశోబు లేఖ

జనవరిలో మరణం… జూన్ లో లెటర్

దిశ దశ, దండకారణ్యం:

సహచర ఉద్యమకారణిగా, సహధర్మచారిణిగా జీవితాన్ని పంచుకున్న ఆమెను చివరి చూపు చూడలేకపోయిన ఓ మావోయిస్టు రాసిన లేఖ ఇది. జనారణ్యంలో ఉన్న తన భార్యను వీడి దండకారణ్యానికి పరిమితమైన ఆ విప్లవ కారుడు పంపిన లెటర్ ఇది. నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తన ఆలి గొప్పతనానికి కితాబిస్తూ… విప్లవ పంథాలో తనతో నడిచిన ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మనో వేదనను అక్షర రూపంలో వ్యక్తీకరించారు. మావోయిస్టు పార్టీ పత్రిక క్రాంతి ద్వారా తన లక్షీతో ఉన్న అనుభందాన్ని నెమరువేసుకున్నారు జగన్ అలియాస్ ఏశోబు. జనవరి 14న లక్ష్మీ మరణించిన సమాచారం అందుకున్న వెంటనే విప్లవ పంథాలో పయనం అవుతున్నప్పుడు ఆమె అందించిన చేయుత, పార్టీ సభ్యురాలిగా చేరి… అటు కుటుంబానికి ఇటు పార్టీ క్యాడర్ కు అండగా నిలిచి సేవలందించిన తీరును ఏశోబు కొనియాడారు. పులి అంజన్న, ఆర్ఈసీ విద్యార్థి నాయకుడు గోపగాని ఐలన్నలాంటి నాయకులతో వ్యక్తిగత పరిచయం కూడా ఉన్న ఆమె మరణం తనను ఎంతో బాదిచిందన్నారు. వయసు రిత్యా మరి కొన్నాళ్లు ప్రాణాలతోనే ఉండాల్సిన లక్ష్మీ రాజ్యం పెట్టిన హింసవల్లే అర్థాంతరంగా తనువు చాలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల క్రితం తనను కలిసేందుకు వచ్చినప్పుడు పోలీసు కాల్పుల నుండి తప్పించుకుంటున్న క్రమంలో టేకు దుంగపై పడడంతో ఛాతికి బలమైన గాయం అయింది… తన శరీరానికి అయిన గాయం తగ్గుతుందిలే… నీవు క్షేమమే కదా అంటూ నన్ను పలకరించిందని ఆయన వివరించారు. హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం టేకులపల్లిలో చర్చి పక్కనే ఇల్లు ఉండడం… ఆ చర్చికి వచ్చే అప్పటి కార్యకర్తలంతా కూడా లక్ష్మీకి పరిచయం అయ్యారన్నారు. వీక్షణం వేణు కూడా అప్పుడు అక్కడకు వచ్చేవాడని వివరించిన ఏశోబు పార్టీ శ్రేణులకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. 1985లో పులి అంజన్న లక్ష్మీకి పార్టీ సభ్యత్వం ఇచ్చాడని తెలిపారు.

అంతా మీ అమ్మ చలవే…

తల్లి మరణం తరువాత ఆమె శవం తల్లడిల్లిపోతున్న నా నలుగురు పిల్లలు పడుతున్న బాధ అంతా ఇంత కాదని, దానిని అక్షరాలలో మల్చలేనివని వారు గుర్తుకు వచ్చారంటే ఆయన మనోవేదనకు తురయ్యారు. కానీ మీరంతా ప్రయోజకులు కావడానికి అమ్మే కారణం అంటూ వ్యాఖ్యానించారు. అమ్మ జ్ఞాపకాలతో తల్లిదండ్రుల ఆశయాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

విప్లవాభివందనాలు…

లక్ష్మీ అంత్యక్రియలు. సంస్మరణ సభలకు పార్టీకి చెందిన పూర్వ నాయకులు, మాజీలు, సానుభూతిపరులు, మిత్రులు హాజరై మా జంట జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారని మీడియా ద్వారా తెలిసింది. నా జీవిత భాగస్వామి అంత్యక్రియల్లో పాల్గొన్నందుకు అందరికి ధన్యావాదాలు తెలిపారు. తన భార్యపై ప్రజా సంఘాల వారు పాట కూడా రాశారని విన్నానని వివరించారు.

ఆమె సేవలు ఆదర్శం: జగన్

విప్లవ పంథాలో తన భర్తతో కలిసి నడిచిన లక్ష్మీ సేవలు ఆదర్శనీయమని మావోయిస్టు పార్టీ పేర్కొంది.వరంగల్ జిల్లాలో 1970లో ఉవ్వెత్తున ఎగిసి పడిన భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఏశోబు, లక్ష్మీలు ప్రభావితం అయి భాగస్వాములు అయ్యారని పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ రహస్య కార్యకలాపాలకు వీరు ఇళ్లు ముఖ్య కేంద్రంగా ఉపయోగడిందని, పులి అంజన్న, తాతా, శ్రీమన్నారాయణలతో పాటు నేటికీ విప్లవోద్యమంలో కొనసాగుతున్న నాయకులు వీరి ఇల్లును, ఈ జంటను మర్చిపోరన్నారు.

You cannot copy content of this page