‘మకంరందమైన’ చర్యలు

జగిత్యాల ఫోర్ట్ లో వినూత్న కార్యక్రమం

దిశ దశ, జగిత్యాల:

కొంతకాలం క్రితం వరకా ప్రాంతం చరిత్ర పుటలకే పరిమితం అయి ఉంది… ఇటీవల కాలంలో అక్కడ ఏడాదికి రెండు సార్లు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. గత కాలపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఆ ప్రాంతం నూతన జిల్లాల ఆవిర్భావం తరువాత మాత్రం ఏడాదికి రెండు సార్లు శుభ్రతకు నోచుకోంటోంది. ఆ తరువాత అక్కడ ఏపుగా పెరిగిన చెట్లు, గడ్డితో పాటు ఇక్కడ ఉన్న బావి కూడా అపరిశుభ్రమైన నీటికి కేరాఫ్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు దీనిని బాగు చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఆ జిల్లా అధికారులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఖిల్లా గడ్డలో నెలకొన్న ఈ అపరిశుభ్రమైన వాతావరణానికి చెక్ పెట్టాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టరు. ప్లాస్టిక్ రహిత కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఫోర్ట్ ను బాగు చేయాలని భావించారు అటవీ శాఖ అధికారులు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం అదనపు కలెక్టర్ మకరంద్ తో పాటు ఫారెస్ట్ అదికారులు ఫోర్ట్ ను బాగు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. అదనపు కలెక్టర్ మకరంద్ దంపతులు కూడా పలుగు పార పట్టి ఫోర్ట్ ఏరియాను శుభ్రం చేసేందుకు నడుం బిగించారు. మాధుర్యాన్ని ఆరోగ్యాన్ని పంచే మకరందం పేరున్న ఐఏఎస్ అధికారి మకరంద్ చుట్టు ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రసంగాలు ఇవ్వడం కాకుండా చేతల్లో ఆచరించడం గమనార్హం. పాడుబడిపోయిన బావితో పాటు ఫోర్ట్ ఏరియాలో పేరకపోయిన చెత్తా చెదారాన్ని తొలగించే పనిలో నిమగ్నం అయ్యారు.

You cannot copy content of this page