శివ ‘బాల’ కృష్ణా..! లీలలు అన్నీ ఇన్ని కావా..?

వసూల్ల సామ్రాట్..?

దిశ దశ, హైదరాబాద్:

అతి సర్వత్ర వర్జయేత్ అన్న సామెతకు అచ్చుగుద్దినట్టుగా సరిపోతారా అధికారి. అతిగా తింటే ఆయాసంతో తల్లడిల్లిపోయినట్టుగా మారిపోయిందాయన గారి తీరు. ఒక్కటా రెండా… వందల కోట్ల ప్రాపర్టీస్ వెలుగులోకి వస్తుంటే ఆశ్చర్యపోవడం అధికారుల వంతవుతోంది. అక్రమార్జన చేశాడనుకున్నారు కానీ ఈ స్థాయిలో వసూళ్ల పర్వానికి తెరలేపాడని ఎవరూ ఊహించలేదేమో.

కస్టడితో మరిన్ని వాస్తవాలు…

ఇటీవలె ఏసీబీ అధికారులు అదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాల కృష్ణను అరెస్ట్ చేశారు. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఆయనను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు విచారణ జరిపారు. ఆయన నుండి సేకరించిన వివరాల ఆదారంగా గుర్తించిన ఆస్తుల విలువ అక్షరాల రూ. 250 కోట్లు. ఇది రిజిస్టర్డ్ వాల్యూయేషన్ రికార్డులను అనుసరించి మాత్రమే. బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్లకు పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఆయన బినామీల పేరిట 214 ఎకరాల భూములు, ఏడు ఇండ్లు, ఒక విల్లా, అతని కుటుంబ సభ్యుల పేరిట 19 ఓపెన్ ప్లాట్లూ, 7 ఫ్లాట్లూ, మూడు విల్లాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. తెలంగాణ, ఏపీలలో కూడా ఆయన ఆస్తులు పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా గుర్తించిన ఏసీబీ అధికారులు ముగ్గురు బినామీలను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసింది. అంతేకాకుండా లాకర్లలో బంగారంతో పాటు ఇతరాత్ర విలువైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ముగిసేలా లేదా..?

శివ బాల కృష్ణ ఏసీబీ కేసు విచారణ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తొలిసారి కస్టడీకీ తీసుకున్నప్పుడే రై. 250 కోట్ల విలువైన ఆస్తులు, ముగ్గురు బినామాలు దొరికారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వీరందరిని వివచారించే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా శివ బాలకృష్ణతో చేతులు కలిపిన ప్రభుత్వ యంత్రాంగంపై కూడా ఆరా తీసేందుకు ఏసీబీ సమాయత్తం అవుతోంది. విచారణలో అక్రమార్కుల గుట్టు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరిన్ని అక్రమాలు, అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చినట్టయితే కస్టడీ పిటీషన్ల పరంపరను ఏసీబీ కొనసాగించనుంది. మొదట బినామీలను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకున్న తరువాత ఒక్కో అంశంపై దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You cannot copy content of this page