దిశ దశ, అయోధ్య:
అయోధ్యలోని శ్రీ రామ జన్మ భూమి వద్ద మందిర నిర్మాణ పనులు చకాచకా సాగుతున్నాయి. తుది దశకు చేరుకున్న శ్రీ రాముని ఆలయంలో మరో కీలక ఘట్టం ముగిసింది. గర్భాలయం చుట్టూ బంగారు తాపడం చేసిన తలుపులు బిగించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరాముని మందిరలోని గర్భాలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. శ్రీరామ జన్మ భూమి ట్రస్టీలు. శ్రీ రాముడు ఐదేళ్ల వయసులో ఉన్నప్పటి విధంగా నల్లరాతిపై చెక్కిన ఈ విగ్రహాన్ని గర్భాలయంలో నిలబడి ఉండే విధంగా ఏర్పాటు చేశారు. రామ్ లల్లా విగ్రహానికి ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. 500 ఏళ్ల క్రితం శ్రీరాముని జన్మభూమిలో ఈ విగ్రహం ధ్వంసానికి గురైంది. ఇక్కడ బాబ్రి మసీదు నిర్మాణం తరువాత శ్రీరాముడి ఆలయాన్ని మళ్లీ నిర్మించాలన్న డిమాండ్ తో పలు రకాల ఆందోళనలు నిర్వహించారు. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో అక్కడ శ్రీ రాముని ఆలయ నిర్మాణం జరిపించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారిన అయోధ్యలో శ్రీరాముని మందిర నిర్మాణం అత్యంత ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా మారిపోయింది.