అరెస్టయితే లాభమేనా..?

తెలంగాణ ప్రజల మనోగతం ఏంటో..?

దిశ దశ, హైదరాబాద్:

ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన తరువాత అరెస్ట్ చేస్తుందా..? ఒక వేళ చేస్తే తెలంగాణ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం తదితర అంశాలపై కులంకశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యయనం చేయించినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఈ అంశాలపై ఇంటలీజెన్స్ వర్గాలతో పాటు ప్రైవేటు ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగి ఆరా తీసినట్టుగా సమాచారం.

వెనక్కి అందుకేనా…?

ముందస్తు ఎన్నికలకు వెల్లే విషయంపై కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన స్టైల్లో బేరీజు వేసుకున్న తరువాతే పార్టీ మీటింగ్ లో డిసెంబర్ లోనే ఎన్నికలని ప్రకటించినట్టుగా అర్థం అవుతోంది. వాస్తవంగా కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గుతుండడం, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల్లోనే తిరుగుతుండడం వల్ల పార్టీ బలహీన పడే అవకాశాలు ఉన్నాయని భావించిన ముఖ్యమంత్రి ఒక దశలో ముందస్తుకు వెల్తేనే బెటర్ అన్న అభిప్రాయంతోనే ఉన్నారని సమాచారం. అయితే ఇదే క్రమంలో కవిత ఎపిసోడ్ కూడా తెరపైకి రావడం ఈడీ నోటీసులు ఇవ్వడంతో అన్ని కోణాల్లో ఆరా తీసి తుది నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థం అవుతోంది. కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ పై సింపతి వేవ్స్ బలంగా వచ్చే అవకాశాలు లేవని కూడా ఎక్కువ జిల్లాల నుండి నివేదికలు సీఎంకు వెల్లినట్టుగా సమాచారం. ప్రజల్లో లిక్కర్ స్కాం వ్యవహారం చాలా రోజులుగా నానుతుండడంతో పాటు సోషల్ మీడియా వేదికగా కవిత టార్గెట్ గా ప్రతిపక్షలు చేస్తున్న ట్రోల్స్ ప్రభావం కూడా పడిందని దీంతో ప్రజల్లో సానుభూతి అంతగా వచ్చే అవకాశాలు లేవని గుర్తించినట్టుగా సమాచారం. ఈ కారణంగానే సీఎం కేసీఆర్ ముందస్తుకు వెల్లవద్దని తాత్కాలికంగా నిర్ణయించినట్టుగా భావిస్తున్నారు. ముందస్తు ప్రకటన చేసినట్టయితే ప్రతి పక్షాలు అడ్వంటైజ్ తీసుకుంటాయోమోనన్న విషయంపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. అయితే కవిత అరెస్ట్ తరువాత మళ్లీ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం. హస్తినలో కవిత విచారణ నుండి అరెస్ట్ అయ్యే వరకు బీఆర్ఎస్ శ్రేణులు చేసే హాడావుడి ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా పడుతుందని కూడా అంచనా వేస్తున్నారని తెలిసింది.

ఏ పార్టీకి లాభం…

కవిత లిక్కర్ స్కాం అరెస్ట్ వ్యవహారం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కాకుండా ఏ పార్టీకి ఎక్కువ లాభం ఉంటుంది అన్న కోణంలోనూ ప్రజల నాడి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఏ పార్టీ ప్రజల్లో ఎక్కువ సానుకూలత సాధించుకుంటుంది అన్న విషయంపై కూడా ఆరా తీశారని సమాచారం. వీటన్నింటిని బేరీజు వేసుకున్న తరువాతే సీఎం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page