విదేశాల్లో ఉద్యోగవకాశాలా… క్రాస్ చేసుకోండిలా…

దిశ దశ, హైదరాబాద్:

విదేశాల్లో ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో నకిలీ ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మి మోస పోకండి. ఏ దేశంలో ఉద్యోగం వచ్చిందో అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోండి. ఉపాధి కోసం యువత ఎదురు చూస్తుంటే నకిలీలు చేస్తున్న మోసాలో ఉచ్చులో చిక్కుకుంటోంది. ఉద్యోగం దొరికిందని గుడ్డిగా నమ్మి నట్టేట మునిగిపోకండి. తీరా ఉపాధి కోసం విమానమెక్కి విదేశానికి చేరిన తరువాత ఊబీలోకి దింపి జీవితాలను సర్వ నాశనం చేసే క్రిమినల్ ముఠాలు వేళ్లూనకున్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవల్సిన అవసరం ఉంది. ఏ దేశానికి చెందిన ఉద్యోగాలు అయినా కేంద్ర ప్రభుత్వం ONALINEలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోందన్న విషయం తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన https://emigrate.gov.in ఈ WEBSITE ద్వారా ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే విశ్వాసంతో ముందుకు సాగాలని తెలంగాణ సీఐడీ అధికారులు సూచిస్తున్నారు. లైసెన్స్ లేకుండా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండనట్టయితే చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేకపోగా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 540 మందిని మయన్మార్ దేశంలోని మైవాడి జిల్లాలో చైనీస్ సైబర్ ఫ్రాడ్ ముఠాలో బందీ అయిన వారికి క్షేమంగా స్వస్థలాలకు చేర్చింది. భారతీయులకు ఉపాధి కల్పిస్తామనగానే ముక్కు మొఖం తెలియని వ్యక్తుల చేతుల్లో లక్షల రూపాయలు పోసి విమానం ఎక్కుతున్నామన్న సంతోషంతో వెలుతున్నారు. మయన్మార్ దేశంలో సైబర్ నేరాలు చేయించేందుకు చైనీస్ కంపెనీలు కోకొల్లుగా వెలిశాయి. కంబోడియా దేశంలో కూడా ఇదే పద్దతిన యువతను వాడుకుంటున్నాయి. బ్రోకర్ల మాటలు నమ్మి వెల్లి సైబర్ ఫ్రాడ్ కంపెనీల కబంధ హస్తాల్లో చిక్కుకున్న తరువాత పాస్ పోర్టులు తీసుకుని వారు చెప్పిన పనులు చేయాల్సిన దుస్థితి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సైబర్ క్రిమినల్స్ ఆర్థిక నేరాలకు పాల్పడాలని చిత్రహింసలకు గురిచేస్తున్నారనే విషయంపై అవగాహన చేసుకుంటే మంచిదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సూచిస్తోంది. మయన్మార్ ఘటనలో 15 మంది ఏజెంట్లను కూడా గుర్తించిన అధికారులు ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. సైబర్ నేరాల బాధితులు 1930కి ఫోన్ చేసి చెప్పడం కానీ, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయడం కానీ చేయాలని సూచిస్తున్నారు అధికారులు.

You cannot copy content of this page