సీనియర్ అసిస్టెంట్ పై అక్రమ ఆస్తుల కేసు…

దిశ దశ. గంగాధర: 

అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హైండెడ్ గా పట్టుకుని కేసులు పెట్టిన తరువాత కూడా మరో కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. లంచం తీసుకుంటున్నప్పడు ట్రాప్ చేసిన ప్రభుత్వ యంత్రాంగం ఆస్తుల వివరాలను కూడా సేకరించి వారిపై ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన సెక్షన్లలో మరో కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తూ లంచం తీసుకుంటుండగా పట్టుబడిన శివారపు సురేష్ బాబుపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. గత ఏప్రిల్ నెలలో రూ.10 వేలు లంచం తీసుకుంటండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే కరీంనగర్ మంకమ్మతోటలో ఉన్న సురేష్ బాబు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో రూ. 12 లక్షల 31 వేల 400 నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను గుర్తించారు. దీంతో సురేష్ బాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. ఈ మేరకు ఏసీబీ డీజీపీ సివి ఆనంద్ ‘‘ఎక్స్’’ వేదికగా షేర్ చేశారు.
https://x.com/TelanganaACB/status/1800515576156287452?t=sOjFfrcrtZjmdHVPLEV90Q&s=08

You cannot copy content of this page