బ్రతకడం కోసం ధనమా… ధనం కోసం బ్రతకడమా..?

దిశ దశ, హైదరాబాద్:

తన ఛాంబర్ లో కూర్చుని బెల్ కొట్టగానే ఠక్కున అటెండర్ పరిగెత్తుకుంటూ వచ్చేవాడు… ఆయన చెప్పిన పని శ్రద్దగా విని తూ.చ. తప్పకుండా కంప్లీట్ చేసేవాడు. ఆయన వాహనం ఎక్కితే డోర్ తెరిచేందుకు ఒకరు… వాహనం కదిలే వరకూ అలెర్ట్ గా ఉండేవారు ఆ ఆఫీసులో పనిచేసే సిబ్బంది.

సెల్ లో కూర్చున్న ఆయన బెల్ కొట్టగానే ఠంచనుగా బయటకు వస్తున్నారు. ఓ చేతిలో ప్లేటు… మరో చేతిలో గ్తాసు పట్టుకుని భోజనం కోసం క్యూలో నిల్చుంటున్నారు. ఒకప్పుడు ఆయన అపాయింట్ మెంట్ కోసం చాలా మంది పరితపిస్తే ఇప్పుడాయన చుట్టూ సీటీ, యూటీ ఖైదీలు మాత్రమే ఉంటున్నారు. ఇది అవినీతి అధికారి శివ బాలకృష్ణ దుస్థితి. ఈయనే కాదు… లంచం తీసుకుంటూ రెడ్ హైండెడ్ గా దొరికిన వారే అయినా… ఆదాయానికి మంచి ఆస్తులు గడించిన వారే అయినా సీ కేటగిరి ఖైదీలుగా జైళ్లలో మగ్గిపోవల్సిందే. బెయిల్ వచ్చే వరకు జైలు గోడల మధ్య కాలం వెల్లదీయాల్సిందే. అటెండర్ అయినా ఉన్నతాధికారి అయినా సరే ఇదే తీరు మర్యాదలు అందుకోవాలని తప్ప వీవీఐపీ సౌకర్యాలు మాత్రం అక్కడ ఉండవు. ఏ లేదా బీ కేటగిరి ఖైదీలుగా వీరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మాత్రం కోర్టు అనుమతి కంపల్సరి. విధుల్లో ఉన్నప్పుడు అదనపు ఆధాయానికి కక్కుర్తి పడి చట్టానికి చిక్కితే ఇలాంటి దుర్భరమైన జీవనాన్ని అనుభవించాల్సిందే. బెయిల్ వచ్చిన తరువాత కోర్టులు శిక్ష విధిస్తే తెల్లటి డ్రైస్ కూడా వేసుకుని ఖైది నంబర్ తో పిలిపించుకోవల్సి వస్తుంది.

కడుపు నిండా తిండి… కుటుంబానికి సరిపడా ఆదాయం వస్తే చాలు… వారసులు జీవితంలో స్థిరపడే విధంగా ఉన్నత చదువులు చదివితే చాలనుకోకుండా వందల కోట్ల రూపాయాల అక్రమార్జన చేయాలన్న తపన వారిని సమజాంలో దోషిగా నిలబెడుతోంది. అవినీతి, అక్రమ ఆస్థులతో చిక్కేవారు ఒకరిద్దరే కావచ్చు కానీ విధుల్లో్ ఉన్నప్పటి జీవితానికి ఏసీబీ కేసు నమోదయిన తరువాతి జీవితానికి పొంతనే లేకుండా పోతోందన్నది వాస్తవం. జైలు జీవితమే కాకుండా బెయిలుపై వచ్చిన తరువాత కూడా ఈ కేసు నుండి బయట పడాలన్న ఆలోచనే నిత్యం వెంటాడుతుంటుంది. దీంతో నిరంతరం మానసిక క్షోభకు గురవుతూ ఉండడం తప్ప మరో దారి మాత్రం దొరికే అవకాశం లేదు. శివ బాలకృష్ణతో పాటు ఇటీవల కాలంలో ఏసీబీ పట్టుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి దయనీయ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి వద్ద కూడా కోట్ల విలువైన ఆస్తులు, బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెతో పాటు రాష్ట్రంలో ఏసీబీ దాడి చేసి పట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇలాంటి విషాదకరంగానే సాగుతుందన్నది నిజం.

రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో కరీంనగర్ కమిషనరేట్ లో నెలకొన్న పరిణామాలను కూడా నెమరువేసుకుంటే మరో కోణం ఆవిష్కృతం అవుతోంది. నిన్నమొన్నటి వరకు అధికార దర్పంతో వెలుగు వెలిగిన కొంతమంది తాము చేసిందే చట్టం అన్న రీతిలో వ్యవహరించారు. ఇప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధిండచంతో జైలు జీవితం గడుపుతున్నారు. నిన్న మొన్నటి వరకు అన్నా… అని పిలుపించుకుంటూ దర్పం ప్రదర్శించిన వారు కూడా జిల్లా జైలులో సాధారణ జీవనం సాగించాల్సి వస్తోంది. ఇంతకాలం అనుచరగణం వలయంలో కాలం వెల్లదీసిన వారి తప్పిదాలు చుట్టుముట్టడంతో అరెస్టులు కాక తప్పలేదు. అన్ని శాఖల అధికారులను తమ గుప్పిట పెట్టుకుని చెలాయించిన వారంతా కూడా కూడా తమ వారిని వారానికి రెండు రోజులు మాత్రమే జాలీ ములాఖత్ ద్వారా చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

You cannot copy content of this page