ఫోటోలు షేర్ చేసిన ఇస్రో
దిశ దశ, స్పెషల్ కరస్పాండెంట్:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) EOS-06 ఉపగ్రహం ద్వారా సేకరించిన భూమి ఫోటోలను విడుదల చేసింది. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) రూపొందించిన మొజాయిక్ చిత్రాలివని అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. EOS-06 బోర్డులో ఓషన్ కలర్ మానిటర్ (OCM) పేలోడ్ ద్వారా ఈ చిత్రాలను సంగ్రహించిన ఈ చిత్రాల నుండి NRSC/ISRO గ్లోబల్ ఫాల్స్ కలర్ కాంపోజిట్ (FCC) మొజాయిక్‌ను రూపొందించిందని ఇస్రో వివరించింది. ఫిబ్రవరి 1 నుండి 15 తేదీల్లో భూమిని చూపించడానికి 330జీబీ డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత 2939 చిత్రాలను కలిపామని, కిలోమీటర్ ప్రాదేశిక రిజల్యూయేషన్ మొజాయిక్ రూపొందిచినట్టు తెలిపింది. గ్లోబల్ మహాసముద్రాల కోసం భూమి, మహాసముద్రాల బయోటాపై వృక్షసంపదని అని ఇస్రో వివరించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా రూపొందించబడిన మొజాయిక్‌లు, ఊహలకందని చిత్రాలను ఇస్రో షేర్ చేసిన ట్విట్టర్ ద్వారా చూసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఇందులో ముఖ్యంగా భారతదేశం ఫోటో అందరినీ అబ్బురపరిచింది.
https://twitter.com/isro/status/1641009724174000128?t=2dA_8jbitoWJ7fzezy8Jvw&s=08