రూ. 8 వేల జరిమానా…
కరీంనగర్ ఏసీబీ కోర్టు తీర్పు
దిశ దశ, కరీంనగర్:
రూ. 4 వేల కోసం కక్కుర్తి పడ్డ డీటీసీఓకు జైలు, శిక్ష జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు జడ్జి కుమార్ వివేక్ తీర్పు నిచ్చారు. ప్రాసిక్యూషన్ తరుపున పీపీ కిషోర్ కుమార్ వాదనలు వినిపించగా సాక్ష్యాధారలను పరిశీలించిన న్యాయమూర్తి ఈ మేరకు జడ్జిమెంట్ ఇచ్చారు. వివరాల్లోకి వెల్తే… మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట డీసీటీఓగా పని చేస్తున్న తొగరి పోచయ్య 2013 సెప్టెంబర్ 27న కాసిపేట మండలం మండలం ముత్యంపల్లికి చెందిన అయిలి సురేందర్ ను లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అప్పటి ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న సుదర్శన్ గౌడ్ ను కలిసి పోచయ్య లంచం అడుగుతున్నారని వివరించారు. బాధితుని నుండి పూర్తి వివరాలు తీసుకున్న ఏసీబీ అధికారుల బృందం డీసీటీఓ పోచయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసును విచారించిన కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టు మంగళవారం నిందితుడు పోచయ్యకు రూ. 8 వేల జరిమానా, 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.