దిశ దశ, నిజామాబాద్:
ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎన్పీడీసీఎల్ ఏఏఈకి జరిమానా, జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. 2008లో నిజామాబాద్ జిల్లా మదనపల్లిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు మక్లూర్ ఏఏఈ మచ్చ సదాశివ్ లంచం అడిగాడు. ఈ లంచం డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడని రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా ఏఏఈని రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసు విచారణ జరిపిన నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఏఏఈ సదాశివ్ కు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.
https://x.com/CVAnandIPS/status/1823715775418413351