15 రోజుల్లో… రూ. 524 కోట్ల కలెక్షన్… పార్ట్ టైం ఉద్యోగాల పేరిట దందా…

ఎంట్రీ ఇచ్చిన ఈడీ

దిశ దశ, హైదరాబాద్:

పట్టుమని పదిహేను రోజుల్లో ఓ ముఠా ఏకంగా రూ. 524 కోట్ల కలెక్షన్ చేసింది. నిరుద్యోగుల ఆశలే పెట్టుబడి చేసుకుని వసూళ్లకు పాల్పడింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసు విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎంట్రీ ఇచ్చి సదరు ముఠాకు చెందిన బ్యాంకు లావాదేవీలను కట్టడి చేసింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం… పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించవచ్చంటూ ప్రకటనలు గుప్పించి దేశ వ్యాప్తంగా వసూళ్లకు పాల్పడిందో ముఠా. పార్ట్ టైం ఉద్యోగాల పేరిట కేవలం 15 రోజుల్లోనే రూ. రూ. 524 కోట్లు వసేలు చేసిందో ముఠా. హైదరాబద్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ఆరంభించింది. ఈ సమాచారం అందుకున్న ఈడీ అధికారులు కూడా కూడా ఎంట్రీ ఇచ్చి దేశంలోని 500 బ్యాంకుల్లోని రూ. 32 కోట్ల నగదను ఫ్రీజ్ చేసింది. నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఈ ముఠా క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయికి నగదును బదిలీ చేసుకున్నట్టుగా గుర్తించారు. వాట్సప్, టెలిగ్రాం యాప్స్ ద్వారా ప్రకటనలు ఇచ్చి వసూళ్లకు పాల్పడినట్టుగా నిర్దారించారు పోలీసులు. దేశ వ్యాప్తంగా కూడా ఈ ముఠాపై 50కి పైగా కేసులు నమోదయ్యాయి.

You cannot copy content of this page