రేకుర్తి భూముల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ సమీపంలోని రేకుర్తి ప్రభుత్వ భూముల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సారెస్పీ భూముల కబ్జాకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో స్థానిక కార్పోరేటర్ అధికారులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. రేకుర్తి మీదుగా వెల్తున్న డి93, 94 కెనాల్స్ కు ఇరువైపులా ఉన్న ఎస్సారెస్పీ భూమిని గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ కార్పోరేటర్ మాధవి, ఆమె భర్త సుదగోని కృష్ణ గౌడ్  అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, మునిసిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అలాగే ఎస్సారెస్పీ కెనాల్ పరిసర ప్రాంతాల్లోని ఇరిగేషన్ విభాగానికి చెందిన భూముల్లో నిర్మాణాలు జరిగినట్టయితే ఆ అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయాలని కూడా ఆ వినతి పత్రంలో కోరడం గమనార్హం. ఈ వ్యవహారంలో వివిధ శాఖల అధికారులు, కార్పోరేటర్ భర్త అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాస్తవాలను వెలుగులోకి తీసుకరావాలన్నారు.

You cannot copy content of this page